న్టీవీతో క్లూస్ టీం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వెంకన్న మాట్లాడుతూ.. నిన్నటి నుండి ఇప్పటివరకు సుమారుగా 50 నుంచి 60 శాంపిల్స్ ను సేకరించామన్నారు. 10 మంది బృందాలు ఏర్పడి క్లూస్ ను సేకరిస్తున్నాము.. సేకరించిన క్లూస్ ఆధారంగా ప్రాధమికంగా షార్ట్ సర్క్యూట్ అని అనుకుంటున్నాము.
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి సంబంధించి క్లూస్ టీం విచారణ ముగిసింది. బీబీనగర్‌లో రైల్వే స్టేషన్‌కు వచ్చిన క్లూస్ టీమ్ మంటల్లో కాలిపోయిన బోగీలను తనిఖీ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే బోగీల నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. సైంటిఫిక్ నివేదిక తర్వాతే అసలు వివరాలు చెబుతామని అధికారులు చెప్పారు.
చీమలపాడు గ్రామంలో సంఘటన జరిగిన గుడిసె ప్రాంతాన్ని క్లూస్ టీం స్వాధీనం చేసుకున్నారు. పేలుడుపై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించడానికి ఘటనా స్థలికి చేరుకుంది. పేలుడు జరిగిన గుడిసెలో క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరిస్తుంది.
పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైంది కల్యాణ్ జ్యువెలరీ దుకాణంలో పనిచేసే రామాంజనేయులుగా గుర్తించారు. భర్త అపహరణపై నిన్న పోలీసులకు రామాంజనేయులు భార్య ఫిర్యాదు చేశారు. జంగం బాజితో పాటు అన్నవరపు కిషోర్ మరికొందరు షాపులోకి వచ్చి అపహరించారని ఫిర్యాదు చేశారు. రామాంజనేయులు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో చంటి అనే వ్యక్తి అదృశ్యం వెనుక రామాంజనేయులు ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే…
ఇబ్రహీం పట్నంలో సంచలనం కలిగించిన కాల్పుల ఘటనలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలంలో రెండు లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అవి ఎక్కడి నుంచి తెచ్చారనేది ఆరాతీస్తున్నారు. కారులో రెండు క్యాట్రిడ్జీలను స్వాధీనం చేసుకుంది క్లూస్ టీమ్. శ్రీనివాస్ రెడ్డిని షాట్ వెపన్ తో, రాఘవేంద్ర రెడ్డి పై తుపాకీతో కాల్పులు జరిపారు దుండగులు. రాఘవేందర్ రెడ్డి మృతదేహం నుండి బుల్లెట్ ను తీసి పోలీసులకు అందజేశారు వైద్యులు. శ్రీనివాస్…
పంజాగుట్టలో బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకపురి కాలనీ నాలుగు సంవత్సరాల బాలిక మృతి చెందింది. ఓ షట్టర్ ముందు నాలుగు సంవత్సరాల అమ్మాయి అనుమానాస్పదంగా మరణించింది. ఆ అమ్మాయిని ఎవరైనా చంపేసి ఇక్కడ పెట్టారా లేక ఇంకేమైనా కారణాలు అనేది తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు క్లూస్ టీం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల అమ్మాయి బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా…