Praja Sangrama Yatra: మౌలాలిలోని మనీషా గార్డెన్స్ లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా.. గంగపుత్రులు కలిసారు. తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. కులవృత్తులను కేసీఆఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గంగపుత్రుల పొట్ట కొట్టేందుకు కేసీఆర్ సర్కార్ జీవో నంబర్ 6 ను తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 6 ను వెంటనే రద్దు చేయాలని వినితి పత్రంలో పేర్కొన్నారు. చేపలు పట్టే వృత్తి గంగపుత్రులకే హక్కుగా ఉండాలని డిమాండ్ చేశారు. గంగపుత్రులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని కోరారు. గంగపుత్రుల హక్కులు కాలరాస్తూ ఇతరులకు మా కులవృత్తిని దాసోహం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర కులస్తుల నుండి రక్షణ కొరకు ఒక ప్రత్యేక గంగపుత్ర చట్టాన్ని తీసుకురావాలని తెలిపారు.
వాజ్ పేయి ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు గంగపుత్రులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే ఎస్టీ జాబితాలో గంగపుత్రులను చేర్చాలని బండి సంజయ్ తో విన్నవించారు. దీంతో స్పందించిన బండి సంజయ్ మీ సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా అని తెలిపారు. అన్ని కులాలు, అన్ని వర్గాలలోని అర్హులకు బీజేపీ తప్పక న్యాయం చేస్తుందని బండి సంజయ్ తెలిపారు.
నిన్న టీఆర్ఎస్ నేతల్ని డంపింగ్ యార్డ్ వద్దే కట్టేయాలని.. తన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా దమ్మాయిగూడ ప్రసంగంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి అధికారం ఇస్తే.. డంపింగ్ యార్డ్ సంగతి తేలుస్తామని హామీ ఇచ్చారు. ‘కేసీఆర్.. మీకు మానవత్వం ఉంటే జవహర్ నగర్‌కు రావాలి’ అంటూ సవాల్ విసిరారు. మేడ్చల్ ఆర్టీసీ డిపో ఆస్తులను కేసీఆర్ తనఖా పెట్టారని ఆరోపించిన బండి సంజయ్.. రోడ్లు కూడా వేయలేని దుస్థితి కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. రూ.110 కోట్లతో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానన్న ట్విట్టర్ టిల్లు హామీ ఏమైందని ప్రశ్నించారు. భూకబ్జాలతో టీఆర్ఎస్ నేతలు కోట్లు దండుకున్నారని విమర్శించిన విసయం తెలిసిందే.
Praja Sangrama Yatra: బండి సంజయ్ ను కలిసిన గంగపుత్రులు.. జీవో నెంబర్ 6ను రద్దు చేయాలని వినతి