Spark Movie: ‘స్పార్క్’ విలన్ గా ‘మిన్నల్ మురళి’ ఫేమ్ గురు సోమసుందర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్రాంత్ హీరోగా పరిచయమవుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’. ఛార్మింగ్ బ్యూటీస్ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అరవింద్ కుమార్ రవివర్మ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దర్శకుడు రవివర్మ గతంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. సో ఈ మూవీ సినిమాటోగ్రఫీ బాధ్యతలూ ఆయనే హ్యాండిల్ చేస్తున్నారు. అనౌన్స్‌మెంట్ రోజునే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీలో టాలెంటెడ్ యాక్టర్, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ గురు సోమసుందరం విలన్‌గా నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు తెలియజేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు.
తాజా ప్రోగ్రెస్ గురించి నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెబుతూ, ”ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ సారథి స్టూడియోలో వేసిన రెండు భారీ సెట్స్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం. అక్టోబర్ 3 నుంచి ఐస్‌ల్యాండ్‌లో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఆ తర్వాత మున్నార్, వైజాగ్‌ల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాం” అని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. మలయాళ చిత్రం ‘హృదయం’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ‘స్పార్క్’ మూవీకి ట్యూన్స్ అందిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కీ-రోల్స్ కోసం రీసెంట్‌గా వెర్సటైల్ ఆర్టిస్ట్ నాజర్, సుహాసిని మణిరత్నం జాయిన్ అయ్యారు. వీరితో పాటు ‘వెన్నెల’ కిశోర్, షాయాజీ షిండే, సత్య, శ్రీకాంత్, కిరణ్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read
- Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
- Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున 'మీర్జాపూర్' కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
- Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!