Suryapet: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. కాంక్రీట్ పనులు చేస్తుండగా లిఫ్ట్ కూలి ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడగా, పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా కంపెనీలో ప్రమాదం జరగడంతో కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదంపై సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు.
Read also: Salman: జవాన్ తో కలిసి వస్తన్న ‘టైగర్’…
ప్లాంట్ పైభాగంలో లిఫ్ట్ కూలిపోవడంతో కార్మికులు 600 అడుగుల ఎత్తు నుంచి పడి మృతి చెందినట్లు సమాచారం. శిథిలాల నుంచి ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరి మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు లోపల చిక్కుకుపోయారు. మృతులు యూపీ, బీహార్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4లో ఈ ప్రమాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ యూనిట్ గత కొంతకాలంగా నిర్మాణంలో ఉంది. అయితే ఈ యూనిట్‌ను అనుమతి లేకుండా నిర్మిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి మై హోమ్ నిర్వాహకులు గోప్యత పాటిస్తున్నారు. వివరాలేవీ వెల్లడించలేదు.
Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం.. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు