Nude Calls : ఈజీ మనీ కోసం అడ్డదార్లు దొక్కుతున్నారు కొందరు అక్రమార్కులు. అమాయక ప్రజలను మోసం చేస్తూ లక్షల్లో సంపాదించేందుకు ప్లాన్ వేస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలంలో వెలుగు చూసిన చామెట్ యాప్ న్యూడ్ కాల్స్, అసభ్య చాటింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. చామెట్ యాప్ తో మహిళలు పక్కదారి పడుతున్నారంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ చామెట్ యాప్ పేరుతో డబ్బులకు న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నట్టు తేలింది.…
Uttam Kumar Reddy : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి, అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర పౌరసరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ తో కలసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈనెల 23 నుండి 25 వరకు జరగనున్న ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు ఉత్తమ్…
Suryapet: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఈనేపథ్యంలో ఐకేపీ కేంద్రంలో నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు చేసి ఎగుమతి చేసిన ధాన్యాన్ని కోదాడ రైస్ మిల్లర్ దిగుమతి చేయకుండా ఐకేపీ కేంద్రానికి తిరిగి పంపారు.
అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ విజయోత్సవ సంబరాలను.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోను ఘనంగా జరుపుకున్నారు. పట్టణానికి చెందిన జనగం ఉదయ్ కిరణ్.. డొనాల్డ్ ట్రంప్ కు వీరాభిమాని. ట్రంప్ పుట్టినరోజు వేడుకలతో పాటు.. పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాడు. బుధవారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం డొనాల్డ్ ట్రంప్ రెండవ సారి భారీ మెజార్టీ సాధించడంతో ఉదయ్ కిరణ్.. పట్టణంలోని ఇందిరా చౌక్ లో స్నేహితులతో కలిసి…
సూర్యాపేట జిల్లాలో వరద పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారుల నివేదిక ప్రకారం 30 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు. ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరిగిందని.. ప్రజలకు విశ్వాసం కలిగించేందుకే తన పర్యటన అంటూ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేశారని, నివేదిక సమర్పించారని సీఎం తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బోరు బావిలో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మునగాల మండలం కలుకోవా గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు కొమర్రాజు లక్ష్మయ్య అనే రైతుగా గుర్తించారు. బోరు బావిలో మోటార్ను దించేందుకు లోపలి దిగడంతో ప్రమాదవశాత్తు ఊపిరి అందక మృతి చెందాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. సంఘటన స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యారు.
Suryapet Road Accident: ఇటీవల తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఓ మైనర్ బాలికపై, 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసినట్లు నేరేడుచర్ల ఎస్సై రవీందర్ నాయక్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్లకు చెందిన 14 ఏళ్ల బాలికపై ఇదే పట్టణానికి చెందిన షేక్ సుబాని(45) అత్యాచారం చేసి పరారైనట్లు ఆయన తెలిపారు.
సూర్యాపేట జిల్లాలోరి హుజూర్ నగర్ నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.