Miyapur Firing: బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కాల్పులు కలకలం సృష్టించాయి. మదీనాగూడలో ఓ ప్రముఖ హోటల్ మేనేజర్‌పై దుండగులు కాల్పులు జరపడంతో సందర్శకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఏం జరిగింది..
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో బుధవారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న జనరల్ మేనేజర్ దేవేందర్ గయాన్‌పై కాల్పులు జరిగాయి. దుండగులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో కోల్‌కతాకు చెందిన దేవేందర్ గయాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మదీనాగూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న దేవేందర్ గయాన్ (35)పై బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కంట్రీ మేడ్ గన్ నుంచి ఆరు రౌండ్లు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే దేవేందర్ ప్రాణాలు వదిలాడు. దేవేందర్ స్వస్థలం కోల్ కతా అని పోలీసులు తెలిపారు.
కాల్పులకు గల పూర్తి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటన స్థలాన్ని మాదాపూర్ జోన్ డీసీపీ సందీప్ రావు, మియాపూర్ ఏసీపీ నరసింహారావు పరిశీలించారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. బుధవారం రాత్రి 9:40 గంటలకు దేవేంద్రనాథ్ హోటల్ నుంచి బయటకు రాగా, హెల్మెట్ ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి అతనిపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడని మాదాపూర్ డీసీపీ జీ సందీప్ తెలిపారు. గాయపడిన దేవేందర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలి అయితే దేవేందర్ చికిత్స పొందుతూ మృతి చెందాడని
అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితుడి గుర్తింపు.. కారణం ఇదీ..
మియాపూర్‌లో రిత్విక్ కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రిత్విక్ బైక్‌పై వచ్చి హోటల్‌లో పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. నిందితులు ఆశ్రయం పొందిన ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మృతుడు సందర్శిని ఎలైట్ హోటల్‌లో ఆర్నెల్లుగా పనిచేస్తున్నాడు. సందర్శినీ హోటల్ మేనేజర్ దేవేందర్ బీదర్ నుండి నగరానికి ఓ యువతినీ తీసుకువచ్చినట్లు సమాచారం. యువతికి సికింద్రాబాద్ లో ఆశ్రయం కల్పించి సందర్శినీ హోటల్ లో హౌస్ కీపింగ్ లో 6 నెలల క్రితం దేవేందర్ ఉద్యోగం కల్పించాడు. అక్రమ సంబందం కారణంగానే రిత్విక్.. దేవేందర్ పై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. 5 బృందాలుగా ఏర్పడి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Astrology: ఆగస్టు 24, గురువారం దినఫలాలు