అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న తెలంగాణ పీసీసీకి కొత్త దిశానిర్దేశం చేయాలని ఏఐసీసీ ఇంచార్జి మాణిక్ రావ్ థాక్రే ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తెలంగాణ నూతన ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే ను ఎయిర్ పోర్ట్ లోని లాంజ్ లో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్ ఆహ్వానించారు.
Ex Mp Ponnam Prabhakar: సింగరేణి బొగ్గు.. తెలంగాణ హక్కు అన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో నాలుగు బొగ్గు గనులను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందని టీఆర్ఎస్ ఆరోపిస్తోందని అన్నారు. వాస్తవంగా సింగరేణి లో ఏ నిర్ణయం తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం ఉండాలని తెలిపారు. తాడిచెర్ల గనుల ప్రైవేటీకరణను రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. తాడిచెర్ల బొగ్గు గనులను జెన్కో ద్వారా ఏఎంఆర్ కంపెనీకి కట్టబెట్టారు. AMR కంపెనీకి…