కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ… నేను రాజీనామా చేసి నాలుగు నెలల 20 రోజులు అవుతుంది. ప్రజాస్వామ్యని అపహాస్యం చేసే పద్దతిలో నాయకుల ప్రవర్తన ఉంది. ఒక్కడిని ఓడగొట్టాలని అసంబ్లీ లో కనపడకుండా చేయాలనీ పరిపాలని పక్కన పెట్టింరు. ఎంఎల్ఎలు ఎంఎల్సీ లు దావత్లకు స్వయంగా సర్వ్ చేస్తున్నారు. సొంత పార్టీ నాయకులను కొనుగోలు చేసే సంస్కృతి తెరాసది. బలవంతం గా కండువాలు కప్పుతున్న టీఆర్ఎస్ పార్టీ అన్నారు.
ఈ రోజు కుల సంఘాల భవనాలకు గుళ్లకు డబ్బులు ఇస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరకి ఏ జీవో ఇచ్చి అయిన సరే గెలవాలని కెసిఆర్ చూస్తుండు. ఈటల మెడ పైన కత్తి పెట్టాలని చుస్తునారు. మీ కోసం కోట్లాడే నన్ను పొడిచి చంపాలని చూస్తున్నారు. దళితుల మీద ప్రేమతో కాదు దళితుల ఓట్ల కోసం దళిత బంధు అని తెలిపారు. ధర్మాన్ని పాతరేసి ఈటలని బొంద పెట్టాలని స్కీమ్ లు అమలు చేస్తున్నారు. రైతుల రుణమాఫీ చేస్తానని డబ్బులు లేవని ఇవ్వటం లెదు ఇదేనా రిచేస్ట్ స్టేట్. ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తానని ఇవ్వకుంటే నిరుద్యోగల ఉసురుతగులదా… దళిత బంధు కులసంగాలకు డబ్బులు ఇచ్చిన తీసుకోని ఈటల వల్లనే వచ్చినాయని నాకు ఓట్లు వేస్తారు. ఎలక్షన్ ఆపాలని పండగలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ కి లేక రాసారు.
అయితే మోకాళ్ల మీద నడిచిన ఇక్కడ టీఆర్ఎస్ గెలవదు. ముఖ్యమంత్రి కొకపేట భూములు అమ్ముతే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్థిక వ్యవస్థ కుదేలు అయింది. మద్యం తాగితే తప్ప డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. దళిత బంధు అమలు చేయాలి అనుకుంటే మొన్న బడ్జెట్ లో నిధులు ఎందుకు కేటా ఇంచలేదు. కాళీ మాత అని పిలిచే ఇందిరా గాంధీ ఓడిపోయింది. ఐకేపీ సెంటర్ లో కొనే వడ్లు కేంద్రమే కొంటాది డబ్బులు కేంద్రమే ఇస్తది. 2 గుంటల అభ్యర్థి ఇప్పటికే వందల కోట్లు ఎట్లా ఖర్చు పెట్టిండు అని పేర్కొన్నారు.