Artisans Strike: సమస్యలు పరిష్కరించాలని 25 నుంచి ఆర్టిజన్ల సమ్మె!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Artisans Strike: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్లు ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. ఈ సమ్మెకు రెండు సంఘాలు మద్దతు తెలుపుతుండగా.. కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సమ్మెకు తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్-82)తో పాటు మరో సంఘం మద్దతు ప్రకటించాయి. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్-82) ప్రధాన కార్యదర్శి సాయిలును ఎస్మా కింద పంజాగుట్ట పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు తెలిసింది. దీనిపై యూనియన్ నేతలు మండిపడ్డారు. సమ్మె పిలుపు నేపథ్యంలో యూనియన్ నాయకులను రెండురోజులుగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని హెచ్-82 యూనియన్ అధ్యక్షుడు మధుకుమార్ ఆరోపించారు. ఈ చర్యలను యూనియన్ తీవ్రంగా ఖండిస్తుందని శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రూ.12,600 బేసిక్‌పై 7శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి, హెచ్‌ఆర్‌ఏలో 6శాతం కోత విధించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆర్టిజన్లు సమ్మె కొనసాగిస్తారని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లో ఐడీ నంబర్ కలిగిన కార్మికులందరినీ ఆర్టిజన్లుగా గుర్తించాలని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయూస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. కొత్తగా నియామకమైన ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీ అమలు చేయాలన్నారు. ఆర్టిజన్ కార్మికులకు స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేసి ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓ అండ్ ఎం ఉద్యోగులు, ఆర్టిజన్లు ఒకే రకమైన పనులు చేసినప్పుడు ఒకే రకమైన రూల్స్ ఉండాలని.. కానీ యాజమాన్యం 2020 లో ఇండస్ట్రియల్ యాక్ట్-1947 ప్రకారం స్టాండింగ్ ఆర్డర్స్ ఇవ్వడం వల్ల వేతనాల్లో వ్యత్యాసం వచ్చిందని ఆయన మండిపడ్డారు. ఓ అండ్ ఎం ఉద్యోగస్తులకు ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయడం వల్ల ఆర్టిజన్లకు చాలా అన్యాయం జరిగిందన్నారు.
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
Read Also: Harish Rao : అవి పేరుకు మాత్రమే డబుల్ ఇంజన్ సర్కార్‌లు
ఆర్టిజన్లు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో యాజమాన్యం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని.. ఈ అరెస్టులను యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. యూనియన్ యాజమాన్యంతో తమ న్యాయమైన డిమాండ్లపై చర్చించడానికి సిద్ధంగా ఉందని నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా పిలిచి తాము ప్రతిపాదించిన న్యాయమైన డిమాండ్లను చర్చించి ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా సమ్మె ఆగదని వారు హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేవరకు పోరాడుతామని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్చరించింది.
- Tags
- Artisans Strike
- jenco
- npdcl
- spdcl
- strike
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!