యువతీ,యువకులు కార్లతో, బైక్ లతో రెచ్చిపోతున్నారు. మితిమీరిన వేగంతో దూసుకెళుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్ధి కారు బీభత్సం సృష్టించింది. రాజమండ్రి రూరల్ కాతేరు వద్ద ఓ ఇంటర్ విద్యార్థి కారుతో బీభత్సం సృష్టించారు. ఇంటర్ విద్యార్థి డ్రైవింగ్ చేస్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్ళింది. రోడ్డుపై ఒక్కసారిగా కారు వేగంగా దూసుకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో ఎవరికి ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. కాతేరు లోని ఓ కార్పొరేట్ కాలేజ్ లో ఇటీవలే విద్యార్థి ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశాడు.
Read Also: Artisans Strike: సమస్యలు పరిష్కరించాలని 25 నుంచి ఆర్టిజన్ల సమ్మె!
ఇవాళ విట్ కళాశాల ఎగ్జామ్ రాసేందుకు కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. అకస్మాత్తుగా కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు.రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఓవైపు మైనర్ లు వాహనాల నడపడంపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నిన్న కాకినాడలో వాహనాలు నడుపుతున్న 120 మంది మైనర్లను పట్టుకుని వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
అయినా టీనేజర్ల చేతుల్లోకి వాహనాలు వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది టీనేజర్లు ఖరీదైన కార్లతో మితిమీరిన వేగంతో నడిపి ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. అందులోనూ కొంతమంది రాజకీయనేతలు, సెలబ్రిటీల పిల్లలు డ్రంక్ అండ్ డ్రైవ్, కార్ల ప్రమాదాలకు గురయ్యారు. సింగిల్ చైల్డ్ పేరెంట్స్ అయితే పిల్లలు తిరిగి రాని లోకాలకు పోవడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also:RR vs RCB: బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్.. ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లీ