Etela Rajender Fires On CM KCR: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అహంకారానికి ఘోరీ కట్టాక.. హుజూరాబాద్ ప్రజలపై ఆయన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. హుజురాబాద్ సబ్ జైల్‌లో చెల్పూర్ సర్పంచ్ నేరేళ్ల మహేందర్ గౌడ్‌తో కలిసిన తర్వాత మీడియాతో ఈటల మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక శాడిస్ట్‌లా, సైకోలా ప్రవర్తిస్తున్నారని.. హుజూరాబాద్ పోలీసులు ప్రభుత్వ బానిసలుగా, అటెండర్‌లుగా పని చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అక్రమ కేసులు ఆపకపోతే.. ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మహేందర్‌ని అక్రమంగా అరెస్ట్ చేశారన్న ఆయన.. సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 2023 వరకే కేసీఆర్ అధికారంలో ఉంటారని, ఆ తర్వాత ఉద్యోగం ఎక్కడ చేస్తారో చూస్తామని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ అతి తక్కువ కాలంలో ప్రజల ఆస్తులు దోచుకొని లక్షల కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. అక్రమ సొత్తుతో దేశంలో రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జూపల్లి, పొంగులేటి తన మిత్రులని.. బీఆర్ఎస్ నాయకులతోనూ తనకు ఫోన్ సంభాషణలు ఉన్నాయని.. అందరి ఎజెండా కేసీఆర్‌ని ఓడించడమేనని పేర్కొన్నారు.
Cricket Betting Gang: క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. కమిషనర్ చౌహాన్ స్ట్రాంగ్ వార్నింగ్
అనంతరం.. హన్మకొండలో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్‌లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కోటి 4 లక్షల కుటుంబాలుంటే, ఒక్క కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలొచ్చాయని అన్నారు. నిరుద్యోగంతో మగ్గుతోంది ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమేనన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రక్తాన్ని దారపోస్తే, ఏ ఒక్క విద్యార్థికి ఉద్యోగం రాలేదన్నారు. కేసీఆర్ కేవలం దోచుకోవడానికి ఉన్నారని, ఆయనకు ప్రజాసంక్షేమం పట్టదని ఆరోపించారు. ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం గంగలో కలుస్తుందని జోస్యం చెప్పారు. 4 పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి కాబట్టి.. టీఎస్పీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేసి, మళ్లీ పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ మళ్లీ పరీక్షలు నిర్వహించలేకపోతే.. కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. కేసీఆర్ వేసిన సిట్‌పై ఎలాంటి నమ్మకం లేదన్నారు. తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. తప్పుడు కేసులకు బీజేపీ భయపడదని అన్నారు. తమ జోలికొస్తే మాడి మసైపోతావ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ఎవరెవరు ఏం చేస్తున్నారో చిట్టా రాస్తున్నామని, రానున్న రోజుల్లో వారికి తగిన బుద్ధి చెప్తామన్నారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.
Nani 30: వెంకీ మామను ఢీ కొట్టబోతున్న నేచురల్ స్టార్!