Metro facility: తమ ప్రాంతాలకు హైదరాబాద్ మెట్రోరైలు సౌకర్యం కల్పించాలని రంగారెడ్డి, మేడ్చల్ ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్ ను కోరుతున్నారు. ఎల్బీనగర్-రామోజీ ఫిల్మ్ సిటీ, ఎల్బీనగర్-తుర్కయాంజాల్-ఆదిభట్ల-కొంగరకలాన్, ఉప్పల్-బోడుప్పల్-ఫిర్జాదిగూడ, మియాపూర్-పటాన్చెరు రూట్లలో మెట్రో రైలు ప్రాజెక్టును వేగంగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎల్బీనగర్-మియాపూర్ మెట్రో రైలు కారిడార్‌ను రామోజీ ఫిల్మ్ సిటీ వరకు పొడిగిస్తామని మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఈ మేరకు డీపీఆర్ సిద్ధం చేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కేటీఆర్‌ను కోరారు. రామోజీ ఫిలిం సిటీకి మెట్రోరైలు సౌకర్యం కల్పిస్తే టూరిజం ద్వారా అధిక ఆదాయం వస్తుందని మంత్రికి వివరించారు.
Read also: MLC Kavitha: హ్యాపీ బర్త్‌డే బావా.. ఆప్యాయంగా విష్ చేస్తూ కవిత ట్వీట్
మరోవైపు కొంగరకలాన్ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు ప్రారంభమైనందున సాగర్‌రింగ్ రోడ్డు మీదుగా తుర్కయాంజాల్, ఆదిభట్ల కొంగర కలాన్ వరకు మెట్రోరైలు నడపాలని రంగారెడ్డి జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కోరారు. ఇక నాగోల్-రాయదుర్గం మెట్రో కారిడార్ ను ఉప్పల్ నుంచి పీర్జాదిగూడ వరకు పొడిగిస్తే ఐటీ రంగానికి మేలు జరుగుతుందని అన్నారు. పోచారం, పీర్జాదిగూడ, బోడుప్పల్ నుంచి ఉప్పల్ వరకు ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. అయితే ఇకపై మెట్రో రైల్ స్టేషన్లలో టాయిలెట్ల వినియోగం ఉచితం కాదని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. స్టేషన్‌లో మరుగుదొడ్డికి రూ.5, మూత్ర విసర్జనకు రూ.2 వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని మెట్రో స్టేషన్లలో మాత్రమే పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే టాయిలెట్లను వినియోగించినందుకు ఇప్పటి వరకు ప్రయాణికుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేదు. అయితే ఇక నుంచి వారికి డబ్బులు వసూలు చేయనున్నారు.
Warning to farmers: కొద్దిరోజులు ఆగండి.. రైతులుకు వాతావరణశాఖ హెచ్చరిక..