తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ.. ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులందరికీ పాదాభివందనాలు చేస్తున్నానని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్ టెక్స్‌టైల్ పరిశ్రమకు భూమిపూజ చేసిన సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు.
కిటెక్స్ టెక్స్ టైల్స్ పరిశ్రమతో పరకాల నియోజకవర్గంలోని వేలాది మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. రైతులు కష్టమైనా, నష్టమైనా ఓర్చుకొని ఇబ్బందైనా తట్టుకొని భూములు ఇచ్చిన వారందరికీ పేరుపేరునా పాదాభివందనాలు చేస్తున్నానని అన్నారు. ఎందుకంటే ఇది చిన్న త్యాగం కాదు. ప్రాజెక్టులకు భూములు ఇచ్చే రైతుల త్యాగాలు వెలకట్టలేనివని తెలిపారు. వాళ్లకు మనం ఎంత చేసినా తక్కువే. వారికి ఏమిచ్చినా రుణం తీరదు. కొంత మంది నష్టపోతే చాలా మందికి లాభం జరుగుతుందని ఆలోచన చేసి, పెద్ద మనసుతో భూములు ఇస్తున్నారని అన్నారు. భూములు ఇచ్చిన రైతులందరికీ 100 గజాల చొప్పున ప్లాట్లు ఇవ్వాలని చెప్పారు. ఖచ్చితంగా ఇస్తామని మాటిస్తున్నానని కేటీఆర్ స్పష్టం చేశారు.
Malla Reddy: రాహుల్ గాంధీ ఓ పప్పు.. మల్లారెడ్డి సెటైర్లు..