Diwali celebrations: దేశమంతా దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. టపాసులు కాలుస్తూ.. దీపాలతో ఇండ్లన్నీ కాంతులతో విరజిల్లాయి. కుటుంబాల్లో ఆనంద కాంతులు వెలగాయి. కుటుంబం మొత్తం టపాసులు కాలుస్తూ నగరాల్లో సందడి వాతావరణం కనిపించింది. అయితే పలుచోటు టపాసులు కాలుస్తూ జరిగిన సంఘటనలు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. టపాసులు కాలుస్తూ చాలామంతి పిల్లలకే గాయాలయ్యాయి. కొందరికి తీవ్ర గాయాలు కాగా ఏపీ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. టపాసులు కాలుస్తూ బాలుడు చనిపోయాడు. ఈఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read also: Anand Mahindra: చర్చిల్‌కు ఇదే సమాధానం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..
దీపావళి వేడుకల్లో టపాసుల ఘటనలతో భాగ్యనగరంలో పలువురు గాయపడ్డారు. బాణసంచా కాలుస్తూ పలువురు గాయపడగా, ఉస్మానియా, సరోజినీ దేవి కంటి ఆస్పత్రులకు బాధితులు క్యూ కట్టారు.గాయపడ్డ వారిలో అత్యధిక మంది చిన్నారులు ఉన్నారు. నగరంలో పటాకులు కాల్చేటప్పుడు జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయపడ్డారు…బాధితులు కంటి సమస్యలతో బాధపడుతూ మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారని, సరోజినీ దేవి ఆసుపత్రికి క్యూ.. ఇప్పటికే 41మంది ఔట్ పేషంట్స్ రాగా.. ఆస్పత్రిలో చేరిన 19 మంది బాధితులు, ఇద్దరికి కంటి ఆపరేషన్ పూర్తి, ముగ్గురు పిల్లలకి సీరియస్, దీపావళి వేడుకల్లో గాయాలైనవారికి చికిత్స కోసం ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేశామని సరోజని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఎక్కువ కేసులు వచ్చినా సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన బాధితుల్లో 5 మందికి సీరియస్ గా ఉందన్నారు. దీంతో.. ముగ్గురిని వేరే ఆసుపత్రికి రిఫర్ చేశామని, గాయపడ్డ వారిలో చిన్న పిల్లలే అధికంగా ఉన్నట్లు.. మరోవైపు ఉస్మానియా గాంధీ హాస్పిటల్ లో కూడా 20 మంది వరకు గాయపడి వచ్చారు వాళ్లకి చికిత్స చేసి పంపినట్టు వైద్యులు తెలిపారు. దివాళీ పండుగను పురస్కరించుకొని ముందస్తు చర్యలు చేపట్టామని సరోజిని దేవి సివిల్ సర్జన్ నజఫీ బేగం తెలిపారు. ఇందులో భాగంగా.. ముందస్తు చర్యల్లో భాగంగా అదనపు వైద్యులు, సిబ్బందిని పెట్టినట్లు తెలిపారు.