Danam Nagender: బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్సి సమక్షంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానం నాగేందర్‌కు కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఖరారు చేసింది. కాగా, బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. తాజాగా రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, యాదయ్య కలిశారు. అలాగే ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. రంజిత్ రెడ్డిని చేవెళ్ల పార్లమెంట్ నుంచి, పట్నం సునీతారెడ్డిని మల్కాజిగిరి నుంచి పోటీకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం.
Read also: Revanth Reddy: ఇన్నాళ్లు సీఎంగా చూశారు.. ఇవాల్టి నుంచి పీసీసీ చీఫ్ గా నేనేంటో చూస్తారు..!
ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం.. ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పోటీ చేసినప్పటికీ ఆయన రాజకీయ గురువు పీజేఆర్ తనయ బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందారు. అయితే దానం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండటంతో.. ఓడిపోయిన చోటే వెతుక్కోవాలని, మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగేందర్‌పై కూడా భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. మరో మాజీ మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డికి అరేయ్ రేవంత్ కు దమ్ముందారా అంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.. కాగా.. నిన్న కర్ణాటక డిప్యూటి సీఎం డి. శివకుమార్ ను కలిసారు. అయితే.. ఒకటి రెండు రోజుల్లో అతను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని రానీయకుండా అడ్డుకుంటున్నారని కీలక సమాచారం. కాగా.. ఇప్పటికే మల్లారెడ్డి అల్లుడు, మల్లారెడ్డి విద్యాసంస్థలు ఆక్రమంగా భూ కబ్జాలు చేసి చర్యలకు రేవంత్ సర్కారు ఉపక్రమించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికైతే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన మొలైంది. ఇక నెక్ట్ మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ లో టెన్షన్ షురూ అయ్యింది.
Bhoomi Shetty: ఇన్‌స్టాలో ఫొటోలు షేర్ చేస్తే.. నల్లగా ఉన్నానని కామెంట్స్ చేస్తున్నారు: హీరోయిన్