ధాన్యం కొనుగోలు సేకరణపై మంత్రి గంగుల కమలాకర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం సేకరణపై మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయన్నారు. గతేడాది కన్నా 30శాతం అధికంగా ఈ సారి ధాన్యం సేకరించామని తెలిపారు. ధాన్యం సేకరించిన అనంతరం రైతులకు చెల్లించాల్సిన డబ్బు చెల్లింపునకు ఎలాంటి నిధుల కొరత లేదన్నారు. opmsలో నమోదైన వెంటనే రైతులకు చెల్లిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.5,447 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి వెల్లడించారు.…
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆటలాడుతున్నాయని సీపీఎం మాజీ ఎమ్మెల్యే, రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటిరంగారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మహబూబ్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకోవాలని చూస్తే రైతులు చూస్తూ ఊరు కోరని వారి పక్షాన సీపీఎం పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికే కళ్లాల వద్ద ధాన్యం వానలకు తడిసి, ఎండలకు ఎండుతుందని మార్కెట్లలో మౌలిక…
రాష్ర్టంలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. నెలరోజుల కిందట కోసిన పంట కూడా ఇప్పటికి తూకానికి రాని పరిస్థితి. రాష్ర్టంలో చాలా జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. కల్లాలు, రోడ్ల మీద కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన పంటను కొనేవారు లేక రైతులు దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పలు జిల్లాలో ధాన్యం తడిసిపోయింది. నల్లగొండ, నిజామాబాద్ వంటి జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం మొలకలు వచ్చింది. రాష్ర్టంలో ఆలస్యంగా కోతలు…
తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన హన్మకొండలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం కేంద్రాల వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. రాష్ర్టంలో 7000కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చాల్సి ఉన్నా ప్రస్తుతం 4000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాత్ర మే ప్రభుత్వం…
బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిన కొనుగోళ్లు ఆపమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బీజేపీ ధాన్యం కొనుగోళ్లపై రాష్ర్టంలో అలజడి సృష్టిస్తుందన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌పై అనవసర విమర్శలు చేస్తుందని, విమర్శలు ఆపి కేంద్రాన్ని ధాన్యం కొనేలా ఒప్పించాలని ఆయన అన్నారు. ఇప్పటికే రాష్ర్టంలో 6,600 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే వీటి సంఖ్యను ఇంకా పెంచుతామని ఆయన తెలిపారు. రాష్ర్టంలో వరి ధాన్యం…