రాష్ర్టంలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. నెలరోజుల కిందట కోసిన పంట కూడా ఇప్పటికి తూకానికి రాని పరిస్థితి. రాష్ర్టంలో చాలా జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. కల్లాలు, రోడ్ల మీద కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన పంటను కొనేవారు లేక రైతులు దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పలు జిల్లాలో ధాన్యం తడిసిపోయింది. నల్లగొండ, నిజామాబాద్ వంటి జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం మొలకలు వచ్చింది. రాష్ర్టంలో ఆలస్యంగా కోతలు…