వ్యాక్సినేషన్‌లో తెలంగాణ రికార్డు.. 5 కోట్ల డోసులు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ వ్యాక్సినేషన్‌లో తెలంగాణ మరో మైలురాయిని దాటింది. రాష్ట్రంలో కొవిడ్ టీకాల పంపిణీ 5 కోట్ల డోసులు పూర్తయింది. వైద్యసిబ్బంది కేవలం 35 రోజుల్లోనే కోటి టీకాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో గురువారం నాటికి మొదటి డోస్ 2.93 కోట్లు, రెండో డోస్ 2.06 కోట్లు, ప్రికాషన్ డోస్ మరియు బూస్టర్ డోస్ 1.13 లక్షల డోసులు పంపిణీ చేశారు. 15-17 ఏళ్ల వారికి 8.67 లక్షల డోసులు (47%) వేశారు. మొదటిడోస్ లక్ష్యానికి మించి దాదాపు 103 శాతం మందికి పంపిణీ చేయగా, రెండో డోస్ 74 శాతం మందికి వేసినట్టు వైద్యాధికారులు తెలిపారు.
Read Also: మా సుపరిపాలన-సుస్థిరతే బీజేపీకి సమాధానం: కేటీఆర్
Also Read
వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు అభినందనలు
టీకాల పంపిణీ 5 కోట్ల డోసులు దాటిన సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఉండి నిరంతరం వ్యాక్సినేషన్‌లో కృషి చేస్తున్న వైద్యసిబ్బందితోపాటు పంచాయతీ, మున్సిపల్, ఇతర శాఖల సిబ్బందిని అభినందించారు. వైద్యసిబ్బంది కృషితో ఇప్పటికే వ్యాక్సినేషన్ మొదటి డోస్ 100 శాతం పూర్తి చేసుకున్న తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పిన విషయాన్ని గుర్తు చేశారు. టీకాలు, కోవిడ్ జాగ్రత్తలు మాత్రమే మనల్ని కరోనా నుంచి కాపాడుతాయన్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకాలు వేసుకోవాలని, ప్రభుత్వానికి సహకరించాలని, మాస్కు విధిగా ధరించాలని మంత్రి హరీష్ రావు తెలిపారు.
తాజావార్తలు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!