Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- మరింత రెచ్చిపోతున్న హౌతీలు
- సౌదీలోని పలు ఎయిర్‌పోర్టులపై దాడి
- తిప్పికొడుతున్న సౌదీ సైన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే యెమెన్ స్వాధీనం దిశగా సాగుతుండగా.. ఈ దూకుడు ఇప్పుడు సౌదీ వరకు సాగుతోంది. గత కొద్ది రోజులుగా హౌతీలు భీకర దాడులు చేస్తున్నారు. తాజాగా మరోసారి సౌదీలోని రియాద్ విమానాశ్రయంపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 36 మందికి గాయాలయ్యాయి.
యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణి దాడి చేసినట్లు ప్రకటించారు. విమానాశ్రయ ప్రాంతం నుంచి దట్టమైన పొగ పైకి ఎగసిపడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో సూడాన్‌కు చెందిన ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో సౌదీ పౌరులతో పాటు ఇతర దేశాలకు చెందినవారూ ఉన్నారు. అభా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన మరో దాడిలో మొరాకో, అల్జీరియా దేశాలకు చెందిన ఇద్దరు మహిళలు మరణించారు. ఈ ఘటనలో మరో 28 మంది గాయపడినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు.
Also Read
- Trump, Putin, Xi Jinping Meet: ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ చారిత్రాత్మక భేటీ.. 5 కీలక విషయాలు ఇవే!
- Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్‌లో లాక్డౌన్!
- Asteroids: భూమి వైపు దూసుకొస్తున్న 5 గ్రహశకలాలు.. నాసా 48 గంటల పాటు అలర్ట్!
- Hindu Population: హిందూ జనాభాలో అగ్రస్థానం.. ముస్లిం జనాభాలో రెండో స్థానం.. 2070 నాటి ప్రపంచంలో భారత్‌లో పరిస్థితి!
రియాద్‌కు ఉత్తర దిశగా వచ్చిన బాలిస్టిక్ క్షిపణిని సౌదీ రక్షణ బలగాలు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. రాజధానిపై దాడులకు ఉపయోగించిన ప్రయోగ వేదికను యెమెన్ రాజధాని సనా ప్రాంతంలో ధ్వంసం చేసినట్లు సౌదీ బలగాలు పేర్కొన్నాయి. హౌతీ లక్ష్యాలపై సౌదీ నేతృత్వంలోని బలగాలు ప్రతిదాడులు చేపట్టిన నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాలతో ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
సౌదీ అరేబియా గగనతలం మీదుగా విమానాలు నడపవద్దని అంతర్జాతీయ విమానయాన సంస్థలను హౌతీలు హెచ్చరించినట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే మక్కా, మదీనా పరిసర ప్రాంతాలకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు సౌదీ అరేబియాలోని అమెరికా దౌత్య కార్యాలయం భద్రతా హెచ్చరిక జారీ చేసింది. క్షిపణులు, డ్రోన్లతో మరిన్ని దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రియాద్, అభా విమానాశ్రయాలపై దాడులు, సౌదీ బలగాల ప్రతిచర్యలతో యెమెన్‌లో కొనసాగుతున్న ఘర్షణలు మరింత విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Chanakya Niti: ఈ 5 రకాల మనుషులతో జాగ్రత్త.. చాణక్య నీతి హెచ్చరిక..
-
Tamil Nadu vs AP: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్? విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. 15 మంది ఉద్యోగులపై వేటు!
-
Kantar BrandZ 2026: ఎయిర్టెల్ నంబర్ 1.. మరి జియో ఎక్కడ? కాంతార్ 2026 ర్యాంకింగ్స్‌లో ఆసక్తికర ట్విస్ట్!
-
Ramayana vs Dangal: 2 వేల కోట్లకు చేరువలో ‘రామాయణ’.. ‘దంగల్’ రికార్డు బద్దలు కొట్టాలంటే ఇంకా..!
-
Supreme Court: కావేరీ జలాల వివాదంలో తమిళనాడుకు భారీ ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!