Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: రేవంత్ పాలనలో రైతుల చేతులకు బేడీలు వేయడం, పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం పరిపాటిగా మారడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. ఇంజనీర్లతో రైతులపై కేసులు పెట్టించడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. మీ చేతగాని తనం వల్ల ఈరోజు పంటలకు నీళ్లు అందక ఎండిపోతున్న దుస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈ మేరకు తాజాగా గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కడుపు మండిన రైతన్న రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ కేసులు బనాయిస్తారా? పోలీసులను ప్రయోగించి భయబ్రాంతులకు గురి చేస్తారా? ఇదెక్కడి దుర్మార్గం? ఇదెక్కడి అన్యాయం? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
కృష్ణాలో నీటి ప్రవాహాలు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం వహించింది మీరు.. నీళ్లను ఒడిసి పట్టకుండా, విడిచిపెట్టి తెలంగాణకు జల ద్రోహం చేసింది మీరంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలోని నాయకులపై మాజీ మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే, శిక్ష రైతులు అనుభవించాలా? అని నిలదీశారు. సాగునీళ్లు లేక, కరెంట్ లేక రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే.. పరిష్కరించాల్సింది పోయి అక్రమ కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ఇది ప్రజా పాలననా? లేక ప్రజా పీడననా? రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతు వ్యతిరేక చర్యలు ఇలాగే కొనసాగిస్తే, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
తాజావార్తలు
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!