Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alias Rukmini: సరైన సాలిడ్ హిట్ కోసం చూస్తున్న యంగ్ హీరో నితిన్‌కు ఇప్పుడు ఒక బలమైన సపోర్ట్ దొరికింది. హీరోగా వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, ఈసారి నితిన్‌కు కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వడమే లక్ష్యంగా రంగంలోకి దిగారు. నాని తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘యూనానిమస్ ప్రొడక్షన్స్’ (uNANImous Productions) బ్యానర్‌పై నితిన్ హీరోగా సరికొత్త చిత్రాన్ని నిర్మిస్తుండటం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘అలియాస్ రుక్మిణి’ అనే డిఫరెంట్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ‘దండోరా’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ సరసన ఆఫియా హీరోయిన్గా నటిస్తోంది.
నిర్మాతగా కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకునే నాని, ఈ సినిమా అవుట్‌పుట్ చూసి ఫుల్ ఖుషీగా ఉన్నట్లు సమాచారం. నితిన్ ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పక్కాగా బౌన్స్ బ్యాక్ అవుతాడనే నమ్మకం నాని మాటల్లో కనిపిస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఈ సినిమా కథ, టేకింగ్‌పై భారీ చర్చ నడుస్తోంది. నాని పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కి సంబంధించి మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు (శుక్రవారం) ఉదయం సరిగ్గా 10:08 గంటలకు ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ ప్రకటనతో సినిమా ప్రమోషన్ల జోరు పెంచాలని చిత్ర బృందం భావిస్తోంది. నితిన్ యాక్టింగ్ పొటెన్షియల్, మురళీకాంత్ మేకింగ్, నాని ప్రొడక్షన్ వేల్యూస్ తోడైతే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందో చూడాలి.
Also Read
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
- Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
- Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
తాజావార్తలు
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!