God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
God of War: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోయే పాన్-ఇండియా చిత్రంపై సినీ ప్రియుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ మైథలాజికల్ విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే తాజా పరిణామాలు ఇప్పుడు తారక్ ఫ్యాన్స్‌ను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. త్రివిక్రమ్ తాజా ప్రాజెక్టుల తీరు చూస్తుంటే, ఎన్టీఆర్ సినిమా గతి కూడా ఏమవుతుందోనన్న అనుమానాలు ఫ్యాన్స్‌లో స్టార్ట్ అయ్యాయి. త్రివిక్రమ్ అంటే ఒకప్పుడు పక్కా ప్లానింగ్, టైంకి సినిమాను పూర్తి చేసే డైరెక్టర్‌గా పేరుండేది. కానీ ఇటీవల ఆయన ట్రాక్ రికార్డ్ అభిమానులకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ షూటింగ్ సమయంలో స్క్రిప్ట్ మార్పులు, రీషూట్లు ఏ స్థాయిలో జరిగాయో అందరూ చూశారు.
ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడ్డాక సినిమా వాయిదా పడటం, మళ్లీ రీషూట్లు, మార్పులు చేర్పులంటూ కాలయాపన చేస్తుండటం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక సాధారణ కమర్షియల్ లేదా ఫ్యామిలీ సినిమాకే ఇంతగా తడబడుతున్న త్రివిక్రమ్, భారీ విజువల్ ఎఫెక్ట్స్, మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌తో అత్యంత సంక్లిష్టంగా తెరకెక్కాల్సిన ‘గాడ్ ఆఫ్ వార్’ను ఎలా హ్యాండిల్ చేస్తారన్నదే ప్రధాన ప్రశ్న. ఇలాంటి భారీ బడ్జెట్ ప్రాజెక్టులకు మైక్రో లెవల్ ప్లానింగ్, పక్కా ప్రీ-ప్రొడక్షన్, రాజీలేని ఎగ్జిక్యూషన్ అత్యంత కీలకం. ఒకవేళ ఇక్కడ కూడా పాత పద్ధతిలోనే రీషూట్లు, స్క్రిప్ట్ మార్పులతో కాలయాపన చేస్తే.. కోట్ల రూపాయల బడ్జెట్ వృథా కావడమే కాకుండా, ఎన్టీఆర్ కెరీర్ గోల్డెన్ టైమ్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఫ్యాన్స్ వాపోతున్నారు. వరుస ప్రాజెక్టులతో త్రివిక్రమ్ చూపిస్తున్న పూర్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ లోపాలు చూసి తారక్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే టెన్షన్ పడుతున్నారు. మరి అభిమానుల భయాలను పటాపంచలు చేస్తూ, ‘గాడ్ ఆఫ్ వార్’ విషయంలో త్రివిక్రమ్ మునుపటి తప్పులు పునరావృతం కాకుండా సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తారో లేదో చూడాలి.
Also Read
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
- Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
- Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
తాజావార్తలు
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!