ఈటల సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్‌ ఆరిపోయే దీపం..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌… కేసీఆర్‌ ఆరిపోయే దీపం అంటూ మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్న ఆయన.. కేసీఆర్‌ పని అయిపోయింది అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుందని జోస్యం చెప్పారు.. ఇక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించిన ఈటల… కరీంనగర్‌లో ఒక ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు… కరీంనగర్‌ నుంచి మాజీ మేయర్‌ రవీందర్ సింగ్.. ఎమ్మెల్సీగా గెలుస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు.. కరీంనగర్ జిల్లా నుంచి చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించిన ఈటల.. కరీంనగర్‌లో టీఆర్ఎస్‌ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు.. ఇక, ఆదిలాబాద్‌లో కూడా జడ్పీటీసీ రాజేశ్వర రెడ్డిని పోటీలో పెట్టామన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.

Related Articles

Latest Articles