CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల కేరళలో పర్యటన నేటితో పూర్తి కానుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం హైదరాబాద్ కి రానున్నారు. రేపు మహబూబ్ నగర్ లో అభ్యర్థి వంశీ నామినేషన్ ర్యాలీ పాల్గొని, కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్నారు. సాయంత్రం మహబూబాబాద్ లో సభ కి సీఎం బయలుదేరనున్నారు. ఇక రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు.
Read also: Top Headlines@ 1 PM : టాప్ న్యూస్
రేపు ఉదయం మహబూబ్ నగర్ లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభ లో పాల్గొంటారు. 20 న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 20 న సాయంత్రం కర్ణాటక లో ప్రచారంలో పాల్గొని, 21న భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 22న ఉదయం ఆదిలాబాద్ లో నిర్వహించే సభలో పాల్గొంటారు. 23న నాగర్ కర్నూల్ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 24న ఉదయం జహిరాబాద్, సాయంత్రం వరంగల్ లో నిర్వహించే సభల్లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు.
Read also: Kishan Reddy: తొమ్మిది ఏళ్లల్లో తెలంగాణకి కేంద్రం పది లక్షల కోట్లు ఇచ్చింది..
ఈ సందర్భంగా రెండురోజులు కేరళ పర్యటనలో భాగంగా.. వాయనాడ్ నియోజకవర్గ అభ్యర్థి రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై విమర్శలు గుప్పించారు. పినరయి విజయన్ కమ్యూనిస్టు నాయకుడు కాదని, మోడీకి మద్దతిచ్చే కమ్యూనిస్టు అని రేవంత్ రెడ్డి అన్నారు. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఇరవై ఏళ్లు రాహుల్ గాంధీ భారత ప్రధానిగా ఉంటారని అన్నారు. గత పదేళ్లుగా వారణాసి ఎంపీ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారని, వచ్చే 20 ఏళ్లు వాయనాడ్ ఎంపీలే ప్రధానమంత్రిగా ఉంటారని ఆయన వాయనాడ్ ప్రజలకు హామీ ఇచ్చారు.
Raj Kundra : శిల్పాశెట్టి భర్త ఆస్తులను జప్తు చేసిన ఈడీ