Kishan Reddy: తొమ్మిది ఏళ్లల్లో తెలంగాణకి పది లక్షల కోట్లు ఇచ్చింది కేంద్రం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో 1947-2014 వరకు 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే.. గత తొమ్మిది ఏళ్ల నుంచి 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించామన్నారు. 26 వేల కోట్లతో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నాం.. పూర్తిగా కేంద్రమే నిర్మిస్తుందన్నారు. కాజీపేటలో RMU, వరంగల్ లో టెక్స్టైల్ పార్క్ కు మోడీ భూమి పూజ చేశారని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ వయబిలిటి ఫండ్ 1204 కోట్లు ఇచ్చిందన్నారు. రైతులకు అండగా RFCL ను ప్రధాని ప్రారంభించారని తెలిపారు.
Read also: Rohit Sharma: నేను ఎవరినీ కలవలేదు.. అవన్నీ అవాస్తవాలే: రోహిత్ శర్మ
ప్రపంచ వ్యాప్తంగా ఫెర్టిలైజర్స్ ధరలు పెరిగితే మన దగ్గర కొరత లేకుండా ఇచ్చామన్నారు. ఒక యూరియా బస్తా మీద 2236 రూపాయల సబ్సిడీని ఇస్తుంది కేంద్రం అన్నారు. పీఎం కిషన్ సమ్మాన్ నిధి కింద రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నామని తెలిపారు. ఆసియలోనే అది పెద్ద బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ కు హైదరాబాద్ లో భూమి పూజా చేశామన్నారు. 889 కోట్లతో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు నన్ను గెలిపించారు.. వారికి జవాబు దారిగా ఉండాలన్నారు. నేను చేశానో దాదాపు 300 పేజీలతో పుస్తకాన్ని తయారు చేశామన్నారు. మొదటి సారి హోం శాఖ సహాయ మంత్రిగా పని చేశానని తెలిపారు. సహాయ మంత్రిగా 8 రాష్ట్రాలకు ఇంచార్జ్ గా ఉన్నానని అన్నారు.
Read also: Indonesia Volcano: భారీ అగ్నిపర్వత విస్ఫోటనం.. సునామీ హెచ్చరికలు జారీ..
ఆర్టికల్ 370 తొలగించినప్పుడు నేను హోం శాఖలోనే ఉన్నానని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దులో నేను భాగం కావడం నా అదృష్టం అన్నారు. కరోనా వచ్చినప్పుడు హోం శాఖను నోడల్ మినిస్ట్రీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం అని తెలిపారు. నోడల్ సెంటర్ కు ఇంచార్జ్ గా పని చేసి.. కరోనా టైంలో సేవ చేశానని తెలిపారు. రెండున్నర ఏళ్ల తరువాత నాకు మూడు శాఖలు ఇచ్చి క్యాబినెట్ మినిస్టర్ గా అవకాశం ఇచ్చారన్నారు. కల్చర్ మినిస్టర్ గా దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించానని అన్నారు. DoNER మినిస్టర్ గా కూడా బాగా పని చేశాననుకుంటున్నానని తెలిపారు. కేంద్ర మంత్రిగా దేశానికి సేవ చేసే అవకాశం దక్కిందన్నారు.
Indonesia Volcano: భారీ అగ్నిపర్వత విస్ఫోటనం.. సునామీ హెచ్చరికలు జారీ..