లాస్ట్ టూ, త్రీ ఇయర్స్ నుండి గమనిస్తే డిసెంబర్ నెలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అఖండ, పుష్ప, సలార్, పుష్ప2 ఇయర్ ఎండింగ్ లోనే వచ్చి వసూళ్ల సునామీని సృష్టించాయి. అందుకే ఈ ఏడాది క్రిస్మస్ మంత్‌ను టార్గెట్ చేస్తున్నాయి పలు చిత్రాలు. ప్రభాస్ రాజా సాబ్ డిసెంబర్ నుండి తప్పుకుని బాలయ్య అఖండ2కి ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఏడాది ఢాకూ మహారాజ్‌తో హిట్ అందుకున్న బాలయ్య.. హిట్ డైరెక్టర్ బోయపాటితో కలిసి ఇయర్ ఎండింగ్ అఖండ2తో బాక్సాఫీస్ దగ్గర రోర్ చేయబోతున్నారు. అఖండ 2కు డిసెంబర్ 25 వరకు పోటీ లేదనుకుంటే.. సడెన్లీ ఎంట్రీ తీసుకున్నాడు శర్వానంద్.
Also Read : Kollywood : డైరెక్షన్ నుండి హీరోలుగా మారుతున్న యంగ్ దర్శకులు
శర్వా హీరోగా వస్తున్న బైకర్ డిసెంబర్ 6న థియేటర్లలోకి వచ్చేస్తోంది. స్పోర్ట్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కాలనుకుంటున్నాడు శర్వా. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఈ స్పోర్ట్స్ డ్రామా ను యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. డిసెంబర్ 25 న ఆది సాయి కుమార్ హీరోగా మిస్ట్రీరియస్ హారర్ త్రిల్లర్ చిత్రం శంభాలతో వస్తోంది. అదే రోజున రోషన్ మేక సెకండ్ ఫిల్మ్ ఛాంపియన్ కు రిలీజ్ కానుంది. స్వప్నా సినిమాస్, ఆనంది క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ స్పోర్ట్స్ డ్రామా కూడా క్రిస్మస్ పండుగనే టార్గెట్ చేస్తుంది. ఇక టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భూమిక, డైరెక్టర్ గుణ శేఖర్ కాంబోలో ‘యుఫోరియా’ అదే రోజు వస్తోంది., టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్, జాతిరత్నాలు ఫేం అనుదీప్ దర్శకత్వంలో లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ కూడా క్రిస్మస్‌కు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు డబ్బింగ్ వర్షన్లతో టాలీవుడ్ బాక్సాఫీసుపై దండయాత్ర చేయబోతున్నాయి అవతార్3 , కన్నడ ఫిల్మ్ 45. జేమ్స్ కెమెరాన్ అవతార్ సిరీస్ నుండి వస్తున్న ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19నే రిలీజ్ కాబోతోంది. కన్నడ ఫిల్మ్ 45 కూడా ఇదే డేటుకు రాబోతోంది.