Women Builders Drill:హనుమంతుడు.. ఆజన్మ బ్రహ్మచారి అని అందరికి తెలుసు. ఆయన బలం.. ఆయన బుద్ది.. ఆయన దైర్యం, ప్రేమ.. అందరికి తెలిసినవే. బలం గురించి మాట్లాడుకుంటే.. కొండను ఎత్తి రాముడి కోసం తీసుకెళ్లిన బలం ఆయనది. అందుకే వ్యాయమ శాలల ముందు హనుమంతుడి విగ్రహాలు పెడతారు. అయితే అది మగవారు వరకు వర్తిస్తుంది. కానీ.. అదే ఆడవారు అయ్యి.. బికినీలు వేసుకొని ప్రదర్శన ఇస్తుంటే.. అందులోనూ బ్రహ్మచారి హనుమంతుడు ముందు.. చెప్పడానికే కొంచెం ఎబెట్టుగా ఉంది కదా.. కానీ, మధ్యప్రదేశ్ లో ఏకంగా ఇది చేసి చూపించారు. ఇక్కడా ఆడ, మగా సమానత్వం గురించి మాట్లాడడం లేదు కానీ.. బ్రహ్మచారి దేవుడు ముందు అలాంటి బట్టల్లో ఫ్యాషన్ షో చేస్తుంటే హనుమంతుని భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వారు అంటున్నారు.
Minister KTR: మంచి పనుల్ని చూపెట్టండి.. తప్పు చేస్తే చీల్చి చెండాడండి
మధ్యప్రదేశ్ లో నేషనల్ బాడీ బిల్డింగ్ షో ఒకటి నిర్వహించారు. లేడీ బాడీ బిల్డర్స్.. బికినీలు వేసుకొని తమ దేహ దారుఢ్యాన్ని ప్రదర్శించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆ స్టేజిపై ఎదురుగా హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆయన ముందే.. బికినిలో ఉన్న మహిళలు క్యాట్ వాక్ చేసుకుంటూ వచ్చి తమ కండలను చూపిస్తున్నారు. దీంతో నెటిజన్స్ వారిపై విమర్శలను గుప్పిస్తున్నారు. ఆడవారు.. అలాంటి బట్టలు వేసుకొని దేవుడి ముందు ఇలాంటి ప్రదర్శనలు చేస్తున్నారు.. ఛీఛీ పాడు అని కొందరు.. మీ ప్రదర్శన చేస్తే చేసుకున్నారు.. అందులోకి దేవుడిని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు అని ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలను ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియాలో షేర్ చేయడం మరింత వివాదానికి దారితీసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
भाजपाई धार्मिक मूर्तियों का अपमान न करें। pic.twitter.com/65MlHVQkb0
— Akhilesh Yadav (@yadavakhilesh) March 6, 2023