Ghulam Nabi Azad Quits: కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన గులాం నబీ ఆజాద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.. పార్టీలో మార్పులకు కోసం పట్టుపడుతూ వచ్చిన ఆయనకు ట్రబుల్ షూటర్‌గా పేరుంది.. కానీ, కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చారు గులాం నబీ ఆజాద్. జమ్మూకశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించిన కాసేపటికే… ఆ పదవికి రాజీనామా చేశారు. జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పదవి నుంచి సైతం తప్పుకున్నారు. అనారోగ్య సమస్యలతోనే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఆజాద్. తనకీ బాధ్యతలు ఇచ్చినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పారు. ఆజాద్ పైకి అనారోగ్య సమస్యలని చెబుతున్నా… అధిష్టానంపై అసంతృప్తితోనే రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆలిండియా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారల కమిటీలో ఉన్న తనని, కశ్మీర్ ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించి తన హోదా తగ్గించారనే భావనలో ఉన్నారు ఆజాద్. అందుకే బాధ్యతలు అప్పగించిన కొద్దిసేపటికే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ పోటీపై కొనసాగుతోన్న సందిగ్ధత
Also Read
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
అయితే, కాంగ్రెస్ ట్రబుల్‌షూటర్‌గా పేరున్న ఆజాద్… పార్టీలో ఎన్నో సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించారు.. రెండేళ్లుగా పార్టీతో దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీలో సంస్థాగత మార్పులు కావాలని కోరుతూ… సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో ఆజాద్ కూడా ఉన్నారు. ఆజాద్ ముఖ్య అనుచరుడు గులామ్ అహ్మద్ మిర్‌ను జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తప్పించిన కొద్ది వ్యవధిలోనే ఆయన కూడా రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, ఓటర్ల జాబితా ఖరారైన తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాదిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జమ్మూ కశ్మీర్లో సంస్థాగత మార్పులు చేపట్టింది. ప్రచార కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ.. తదితర కమిటీలను సోనియా ఏర్పాటు చేశారు… కానీ, ఆజాద్ నిర్ణయంతో.. కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తాకినట్టు అయ్యింది.
తాజావార్తలు
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!