TS TRT : 5,089 పోస్టులకు టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ లో ఎలక్షన్స్ హడావుడి మొదలు కావడంతో ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. పాఠశాల విద్యాశాఖ లో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. దానిలో భాగంగా ఆగస్టు 1 న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెట్ పరీక్షను సెప్టెంబర్ 15 న నిర్వహించి అదే నెల 27 న ఫలితాలు విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా తెలంగాణ ఆర్ధిక శాఖ 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్లియరెన్స్ ఇచ్చింది. దీనితో ఎప్పటినుంచో లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూస్తున్న టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్‌టీ) నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది.నవంబరు 20 నుంచి 30వ తేదీ మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్స్ (సీబీటీ) ను నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 20 నుంచి అక్టోబరు 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఇటీవలే 5,089 ఉపాధ్యాయ ఖాళీలతోపాటు మరో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు టీఆర్‌టీ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, భాషా పండితుల పోస్టులను భర్తీ చేస్తారు. అయితే ఈ నోటిఫికేషన్‌లో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీల భర్తీ గురించి మాత్రం ప్రస్తావించలేదు.టీఆర్టీ పరీక్షను ప్రభుత్వం తొలిసారిగా ఆన్‌లైన్ లో నిర్వహించనున్నారు.మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.అయితే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాలు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్లు సడలింపును ఇస్తారు. అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. దివ్యాంగులకు మాత్రం పది సంవత్సరాల సడలింపు ఉంటుంది.దరఖాస్తు ఫీజు రూ.వెయ్యిగా నిర్ణయించారు. ఈనెల 20 నుంచి అక్టోబరు 20 వరకు ఫీజును చెల్లించవచ్చు.ఆన్‌లైన్‌లో దరఖాస్తును దాఖలు చేసే దశల వారీ ప్రక్రియ, జిల్లా వారీగా ఖాళీలు, ఇతర వివరాలన్నీ కూడా ఈనెల 15 నుంచి గవర్నమెంట్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని విద్యాశాఖ పేర్కొంది.
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్‌ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- Tags
- #trt
- Notification
- ts
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!