Mother Stork Throwing Her Weakest Chick out of the Nest: తల్లీ బిడ్డల బంధం కేవలం మనుషుల్లోనే కాదు ఏ జంతు జాతిలో అయినా ఓకేలా ఉంటుంది. తమ బిడ్డలను కాపాడుకోవడం కోసం తల్లి ఏమైనా చేస్తుంది. అఖరికి తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిడ్డను రక్షించుకుంటుంది. ఈ పోరాటంలో ఎంతటి వారిని ఎదిరించడానికైనా సిద్దపడుతుంది. ఇక అలాంటిది వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం ఓ కొంగ తన పిల్ల పట్ల దయలేకుండా ప్రవర్తించింది. దానిని చాలా ఎత్తులో ఉన్న గూడు నుంచి బయటకు తోసేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుంతుంది.
Also Read: Sita Mandir: బీహార్ లో సీతా మందిర్.. రాజకీయాల కోసమేనా?
ఈ వీడియోను టెర్రిఫయింగ్ నేచర్ అనే యూజర్ ఎక్స్( ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోలో ఓ కొంగతో పాటు దాదాపు ఐదు పిల్లలు ఉన్నాయి. అయితే అందులో ఒక పిల్ల పట్ల కొంగ నిర్ధయగా ప్రవర్తించింది. మొదట ఆ కొంగ పిల్ల తన తల్లి కాలును కొరుకుతూ ఉంటుంది. తల్లి కొంగ దాని మెడను నోటితో పట్టుకొని కొంచెం పక్కగా నేల కేసి కొడుతుంది. తరువాత దానిని చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అయితే కొద్ది సేపటికి దాని పీకను గట్టిగా నోటితో కరుచుకొని ఎక్కడో చాలా ఎత్తులో ఉన్న గూడు నుంచి కిందకు పడేస్తుంది. తరువాత కొంగముఖం చూస్తే బాధతో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. బలమైన మిగతా పిల్లల పోషణపై దృష్టి పెట్టేందుకే బలహీనమైన పిల్ల అడ్డును ఆ తల్లి కొంగ తొలగించుకుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. బలమైన వారు మాత్రమే బతికి ఉంటారు అనేది ప్రకృతి ధర్మమని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా పిల్లలు బలహీనంగా ఉన్నంత మాత్రాన తల్లి అలా వదిలించుకుంటుందా అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. అలా అయితే మనుషుల్లో అంగవైకల్యంతో ఉన్న ఎంత మంది మనుషులు వదిలించుకోవాలి. ఎలా ఉన్నా బిడ్డను రక్షించాల్సిన బాధ్యత తల్లిదే అంటూ మరికొందరు వాదిస్తున్నారు.