పిల్లలను కిడ్నాప్ చేస్తారు.. కొద్ది రోజులు పెంచుతారు.. లోకం పోకడ తెలియగానే.. బిచ్చగాళ్లుగా మారుస్తారు.. ఆరు నెలల పసికందుపై కన్నేసిన ఇద్దరు మాయలేడీలు.. బాలునితో బిక్షాటన చేయించాలని పథకం రచించి.. సికీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. తల్లి ఒడికి దూరమైన 24 గంటల వ్యవధిలో నిజామాబాద్ పోలీసులు కేసును చేధించి.. కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. పసికందును తల్లి ఒడికి చేర్చారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని.. వినాయక్ నగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి -కిషన్ దంపతులు భిక్షాటన చేస్తూ.. కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. లక్ష్మి తన పిల్లలతో కలిసి భిక్షాటన చేస్తున్న క్రమంలో.. మహారాష్ట్రకు చెందిన పద్మ, రేణుకా పవార్ లు లక్ష్మితో మాటలు కలిపారు. ఆరు నెలల బాలుడు కార్తీక్ కు .. పాత బట్టలు ఇస్తామంటూ లక్ష్మి చేతిలో బాబును ఎత్తుకుని.. ఇదిగో వస్తామంటూ మాయమయ్యారు. బాబును ఎత్తుకెళ్లారని గ్రహించిన లక్ష్మి పోలీసులను ఆశ్రయించింది.
సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆర్య నగర్ లో ఉంటున్న మాయ లేడీలను పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించారు. పోలీసులు తనిఖీలకు వెళ్లిన సమయంలో బాబును లగేజీ బ్యాగ్ లో కుక్కి.. బాబు లేరంటూ పోలీసులను బుకాయించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు బాబును గుర్తించి తల్లి ఒడికి చేర్చారు. అపహరణకు గురైన 24 గంటల్లోపు పసికందును తల్లి ఒడికి చేర్చారు. కొడుకు కోసం తల్లడిల్లిన ఆ పేద తల్లి ఒడికి బిడ్డను చేర్చిన పోలీసులకు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
మహారాష్ట్రకు చెందిన పద్మ, రేణుకా పవార్ లు భిక్షాటన చేస్తూ.. ఆర్యనగర్ లో స్దిరపడ్డారు. ఓ పసికందును అపహరించి భిక్షాటన చేయించాలని ప్లాన్ తో.. లక్ష్మి కుమారుని పై కన్నేశారు. ఆరు నెలల పసికందును పక్కా ప్రణాళిక ప్రకారం కిడ్నాప్ చేసి.. పరారయ్యారు. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుల ఆచూకీ కోసం నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అపహరించిన మహిళల నుంచి బాలున్ని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు పోలీసులు. బాలునితో భిక్షాటన చేయించాలని, బేరం కుదిరితే అమ్మాలని ప్లాన్ తో కిడ్నాప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అపరిచితుల తో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నిందితులకు నేర చరిత్ర ఉందా..గతంలో ఇలాంటి కిడ్నాప్ లు చేశారా అని లోతుగా విచారిస్తామని పోలీసులు తెలిపారు. కొడుకు కోసం 24 గంటలుగా తల్లడిల్లిన ఆ తల్లి తన కొడుకుని చూసి గుండెలకు హత్తుకుంది. ఈ కేసును చేధించడంలో కృషి చేసిన టాస్క్ పోర్స్, సీసీఎస్, నాలుగో టౌన్ పోలీసులకు ఉన్నతాధికారులు అభినందించారు.
Vamshi Paidipally: సర్కారు కోసం తమన్ నన్ను కూడా పక్కన పెట్టేశాడు