పిల్లలను కిడ్నాప్ చేస్తారు.. కొద్ది రోజులు పెంచుతారు.. లోకం పోకడ తెలియగానే.. బిచ్చగాళ్లుగా మారుస్తారు.. ఆరు నెలల పసికందుపై కన్నేసిన ఇద్దరు మాయలేడీలు.. బాలునితో బిక్షాటన చేయించాలని పథకం రచించి.. సికీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. తల్లి ఒడికి దూరమైన 24 గంటల వ్యవధిలో నిజామాబాద్ పోలీసులు కేసును చేధించి.. కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. పసికందును తల్లి ఒడికి చేర్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని.. వినాయక్ నగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి -కిషన్ దంపతులు భిక్షాటన చేస్తూ..…