Chevella Bus Accident: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిపై పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం 19 మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రి నుండి వచ్చిన 12 మంది వైద్యుల బృందం ఈ పోస్టుమార్టం ప్రక్రియలో పాల్గొన్నారు. ఫోరెన్సిక్ విభాగం వైద్యుల ప్రకారం, ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ఎలాంటి మద్యం సేవించలేదని తేలిందని తెలిపారు.
Siddaramaiah: సీఎం మార్పు గురించి హైకమాండ్ చెప్పిందా? మీడియాపై సిద్ధరామయ్య రుసరుసలు
ఇప్పటికే 18 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చివరి మృతదేహం.. టిప్పర్ డ్రైవర్‌ది.. అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. డ్రైవర్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. మరికాసేపట్లో టిప్పర్ డ్రైవర్ మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ ఇప్పటికే చేవెళ్ల ఆసుపత్రికి చేరుకుంది. ఈ ఘటనతో చేవెళ్ల ప్రాంతం అంతా విషాదంలో మునిగిపోయింది.
Nagakurnool : SLBC టన్నెల్ ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి !