Chevella Bus Accident: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిపై పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం 19 మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రి నుండి వచ్చిన 12 మంది వైద్యుల బృందం ఈ పోస్టుమార్టం ప్రక్రియలో పాల్గొన్నారు. ఫోరెన్సిక్ విభాగం వైద్యుల ప్రకారం, ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ఎలాంటి మద్యం సేవించలేదని తేలిందని తెలిపారు. Siddaramaiah: సీఎం మార్పు గురించి హైకమాండ్ చెప్పిందా? మీడియాపై సిద్ధరామయ్య రుసరుసలు…
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్‌కు మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. జుబీన్ గార్గ్ మరణంపై పెద్ద ఎత్తున అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జుబీన్ గార్గ్ భార్య అనుమతితో రీపోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.
నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నంద్యాల శివారు కర్నూలు బై పాస్ రోడ్డులోని ఎల్.కే. ఆర్. ఫంక్షన్ హల్ వద్ద హత్య జరిగింది. ఆటో డ్రైవర్ వినయ్ కుమార్ అలియాస్ మోతిని మిత్రులే రాళ్లతో కొట్టి చంపేశారు. వినయ్ కుమార్ స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఈ దావత్‌లో స్నేహితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన 265 మంది మృతదేహాలకు సివిల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం కొనసాగుతుంది. అయితే, విమాన ప్రమాదంలో ఛిద్రమైన కొన్ని మృతదేహాలు.. వారి కుటుంబ సభ్యుల డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తిస్తున్నారు.
భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం వంజిరిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన డోకే జయరామ్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఒక అమ్మాయి పుట్టింది. ఆమెకు ఇక పిల్లకు పుట్టక పోవడంతో మగపిల్లాడి కోసం రెండో వివాహం చేసుకున్నాడు జయరామ్.
గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. బాంరగడ్ తాలుక జూవి గ్రామానికి చెందిన పూసు పుంగంటి (52) అనే వ్యక్తిని మావోలు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం మేరకు, ఓ వివాహ వేడుకకు వెళ్లిన పూసు పుంగంటిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి, అనంతరం హత్య చేశారు. అతను పోలీసులకు సహకరిస్తున్నాడనే అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ…
Sumanth Reddy: వరంగల్‌లో జరిగిన దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డాక్టర్ సుమంత్ రెడ్డి తన ప్రాణాలను కోల్పోయిన విషాదకర ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత నెల 20వ తేదీన బట్టుపల్లి సమీపంలో కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఈ దాడి వ్యవహారంలో ఆయన భార్య ఫ్లోరా ప్రధాన ముద్దాయి అని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్ రెడ్డిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఒక…
Nandikotkur: నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ లో ప్రేమోన్మాది చేతిలో హతమైన లహరి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సంఘటన స్థలాన్ని క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలించింది. లహరి మృతికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
కోల్‌కతా ఆర్‌జీ కేర్ మెడికల్ ఆస్పత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ హత్య కేసు వ్యవహారం పశ్చిమ బెంగాల్‌ను కుదిపేస్తోంది. అత్యంత దారుణంగా హత్యాచారం చేసి నగ్నంగా పడేశారు. దీంతో డాక్టర్లు, నర్సులు, విద్యార్థి సంఘాలు, విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. తక్షణమే నిందితుల్ని శిక్షించకపోతే విధుల్ని బహిష్కరిస్తామని మెడికోలు హెచ్చరికలు జారీ చేశారు.
Tamilnadu: తమిళనాడులోని మైలాడుతురై జిల్లా తరంగంబాడి తాలూకాలోని తిలయాడి గ్రామంలో బుధవారం బాణాసంచా తయారీ యూనిట్, గోదాములో జరిగిన పేలుడులో నలుగురు వ్యక్తులు మరణించారు.