కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి చేసుకోబోతుంది. దీంతో మరోసారి ముఖ్యమంత్రి మార్పు అంశం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య రుసరుసలాడారు. నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ హైకమాండ్ మీకేమైనా చెప్పిందా? అని మీడియాను ప్రశ్నించారు. నాయకత్వ మార్పుపై ప్రజల కంటే మీడియానే ఎక్కువ ఆసక్తి కనబరుస్తోందని వ్యాఖ్యానించారు. నాయకత్వ మార్పు గురించి మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏమైనా చెప్పినప్పుడు దాని గురించి ప్రశ్నించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: 18నే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తా.. గెలుపుపై తేజస్వి యాదవ్ ధీమా
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై హైకమాండ్‌తో చర్చించబోతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే నవంబర్ 11న డీకే శివకుమార్ అధిష్టానాన్ని కలవబోతుండగా.. 15వ తేదీన సిద్ధరామయ్య కలుస్తున్నట్లు సమాచారం. 50 శాతం మంది మంత్రులను తొలగించి.. కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ సీఎం మార్పుపై అనేక ఊహాగానాలు వచ్చాయి. బహిరంగంగానే డీకే.శివకమార్ మద్దతుదారులు కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేయబోతోంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు