BRS Meeting: నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాలు అందజేయనున్నారు. ఒక్కో అభ్యర్థికి ఎన్నికల ఖర్చు కోసం రూ. 95 లక్షల చెక్కులను కేసీఆర్ ఇవ్వనున్నారు. అనంతరం పార్టీ నేతలతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
Read also: Mrunal Takur : జిమ్ లో తెగ కష్టపడుతున్న మృణాల్.. వీడియో వైరల్..
చేవెళ్ల బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ స్థానానికి అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మల్కాజిగిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించగా.. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వీరికి ఇవాళ తెలంగాణ భవన్‌లో జరిగే పార్టీ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీ-ఫామ్‌ను అందజేయనున్నారు. ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Read also: Elections 2024: తొలి విడత పోలింగ్ రేపే.. ఏ రాష్ట్రాలలో.. ఏ స్థానాలలో అంటే..
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 18 నుంచి 25 వరకు ఆదివారం మినహా సెలవు దినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. ముహూర్తాలు చూసుకుని వివిధ పార్టీల ఎంపీ అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు.
Read also: Raghava Lawrence : రెండు రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్..
ఈ నెల 21వ తేదీ ఆదివారం వరకు నామినేషన్ల దాఖలుకు ఏడు రోజుల గడువు ఉంది. పేరు, నక్షత్రం ఆధారంగా మంచి తేదీని చూసుకున్న తర్వాత నామినేషన్లు దాఖలు చేయబడతాయి. ఈ నెల 18, 19, 21, 23, 24 తేదీలు మంచివని పండితులు చెబుతున్నారు. 21వ తేదీ ఆదివారం కావడంతో మిగిలిన నాలుగు రోజుల్లో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి.
Memantha Siddham Bus Yatra: 17వ రోజుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే..