BRS Meeting: నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాలు అందజేయనున్నారు.
IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, పైళ్ల జనార్దన్ రెడ్డిల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మూడు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్ఎస్ ఉద్యమం ఉధృతం చేసింది. నేడు లోక్ సభ లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్. అఖిలపక్ష సమావేశం నిర్వహించి మహిళ రిజర్వేషన్ బిల్లుపై చర్చించాలని ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత ఈ తీర్మానం నోటీసులు అందజేశారు.