Bandi Sanjay Padayatra: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై సందిగ్ధత నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు పాదయాత్ర మొదలవుతుందా..? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. లా అండ్ ఆర్డర్ కారణాల వల్ల చివరి నిమిషంలో పోలీసులు మార్చ్‌కు అనుమతి నిరాకరించారు. పోలీసుల నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఈరోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు బండి సంజయ్ పాదయాత్రపై మధ్యాహ్నానికి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐదో దశ పాదయాత్ర ప్రారంభానికి బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను రాష్ట్ర బీజేపీ నేతలు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. చివరి నిమిషంలో పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఫడ్నవీస్ రాకపై కూడా డైలమా నెలకొంది. హైకోర్టు నుంచి తమకు అనుకూలంగా ఉత్తర్వులు వస్తాయని, పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుందని కాషాయ వర్గాలు భావిస్తున్నాయి.
Read also: CM KCR: నేడు జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం.. ధరణీ సమస్యలపై చర్చ
సోమవారం భైంసా నుంచి ఐదో దశ ప్రజాసంగ్రామ పాదయాత్ర ప్రారంభించేందుకు బీజేపీ ఇప్పటికే రూట్ మ్యాప్‌ను ఫిక్స్ చేసింది. ఇందుకు పోలీసులు ముందస్తుగా అనుమతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం భైంసా నుంచి పాదయాత్రకు బయలుదేరిన సంజయ్‌ను జగిత్యాలలో పోలీసులు అడ్డుకున్నారు. భైంసా సున్నిత ప్రాంతమని, పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ను అరెస్టు చేసి కరీంనగర్‌లోని అతని ఇంటికి తీసుకెళ్లారు.
Read also: China Boy Watching TV: టీవీ చూస్తున్నాడని.. కుమారుడికి పేరెంట్స్ కఠిన శిక్ష
బండి సంజయ్ కామెంట్స్ :
ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాలుగు విడతలు ప్రశాంతంగా యాత్ర చేసామని బండి సంజయ్ అన్నారు. అన్ని యాత్రలకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఐదో విడత రేపు ఉదయం 12.30 నిమిషాలకు ప్రారంభించాలను కున్నామని తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు బాబురావు అన్ని పర్మిషన్ లు కు అప్లయ్ చేశారని అన్నారు. రోడ్ మ్యాప్ బహిరంగ సభ ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయని తెలిపారు బండి సంజయ్. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెర్నాండెస్ పర్యటన కు అన్ని ఏర్పాట్లులో పోలీసులు పాల్గొన్నారు. బైంసా వెళ్తుండగా కోరుట్ల దగ్గర పోలీసులు నన్ను ఆపారని మండిపడ్డారు. పోలీసులు పహారా చేస్తూ బీజేపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. పర్మిషన్ అప్లై చేసినప్పుడు బైంసా సెన్సిటివ్ ప్లేస్ అని ముఖ్యమంత్రి కి గుర్తుకు రాలేదా? అంటూ ప్రశ్నించారు. వారం రోజులుగా అక్కడ ఏర్పాట్లు జరుగుతుంటే అప్పుడు తెలియలేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బైంసా తెలంగాణ లో ఒక భాగంని తెలుసుకో.. అంటూ మండిపడ్డారు. బైంసాని కాపాడని ముఖ్యమంత్రి ఏమనాలి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు యాత్రకు పోలీసులు డ్యూటీ కూడా వేశారని చెప్పారని, బైంసా పోవాలంటే మేము వీసా తీసుకుని పోవాలా అది వేరే దేశంలో ఉందా? అంటూ ప్రశ్నించారు బండిసంజయ్. 15 ఇల్లు దగ్ధం చేస్తే పట్టించుకొని ప్రభుత్వం ఇక్కడ ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర గొడవలు చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పాతబస్తి నుండే యాత్ర ప్రశాంతంగా నిర్వహించాము బైంసా నుండి అలానే చేస్తామని సంపథం చేశారు. తెలంగాణ లో శాంతి భద్రతలు క్షిణించాయని మండిపడ్డారు. కార్యకర్తలను కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినే ముఖ్య సమస్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బండిసంజయ్.
Thalapathy Vijay: 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ…