Betting Seva : నిర్మల్ జిల్లా పోలీసులు భైంసా ప్రాంతంలో జరుగుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాపై గట్టి దాడి చేసి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏడాది కాలంగా భైంసాను అడ్డాగా చేసుకుని ఈ అక్రమ కార్యకలాపాలను నడిపిస్తున్న సయ్యద్ ఆజమ్‌ను గురువారం రాత్రి ఓవైసీ నగర్‌లోని ఓ ఆలయం సమీపంలో మెరుపుదాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించిన వివరాల ప్రకారం, ఆజమ్ మీ సేవా సెంటర్ ముసుగులో Allpannel.com అనే…
Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అలా తెరపడిందో లేదో.. నిర్మల్ జిల్లాలోని భైంసాలో ఇలా ఘర్షణకు తెరలేచింది. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బంధువు ఇంటిలో డబ్బుల డంప్ ఉందనే సమాచారం మేరకు ఎఫ్ఎస్‌టీ టీమ్‌తో పోలీసులు సోదాలు చేశారు. దాంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ దగ్గర డబ్బులు లేవని…
ఎన్నికల ప్రచారంలో భాగంగా భైంసాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ఆగం ఆగం అబద్ధాలు చెబుతారని కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వస్తాయి పోతాయి, ఎవ్వరో ఒక్కరు గెలుస్తారని చెప్పారు. ఎన్నికల్లో నిలబడే వ్యక్తి ఎవ్వరో చూడాలని.. ఏ పార్టీ చరిత్ర ఏంటో చూడాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఓటు వజ్రాయుధం.. ఆలోచించి ఓటు వేయాలని ఆయన తెలిపారు.
జాతీయ స్థాయిలో మే 5న విడుదలైన 'ది కేరళ స్టోరీ' తెలుగు వర్షన్ శనివారం నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శితమౌతోంది. అయితే భైంసాలాంటి పట్టణాలు ఈ సినిమా ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడం వివాదాలకు దారితీస్తోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజసంగ్రామ యాత్ర నేడు ఇవాళ ఉదయం తాడేపల్లి నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. నేడు గుండెగావ్, మహాగావ్ మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.
బీజేపీది పాద యాత్ర కాదు కుట్రల యాత్ర అని చీఫ్ విప్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై సందిగ్ధత నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు పాదయాత్ర మొదలవుతుందా..? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. లా అండ్ ఆర్డర్ కారణాల వల్ల చివరి నిమిషంలో పోలీసులు మార్చ్‌కు అనుమతి నిరాకరించారు. పోలీసుల నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఈరోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది.
శ్రీరామ నవమి వచ్చేస్తోంది… అయితే, ఈ సందర్భంగా నిర్వహించే శోభాయాత్రపై అంశం హైకోర్టుకు చేరింది… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసాలో శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఈ మధ్య చోటుచేసుకున్న కొన్ని ఘటన నేపథ్యంలో.. భైంసాలో శోభాయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో, హైకోర్టు మెట్లెక్కింది హిందూ వాహిని సంస్థ.. ఇక, కొన్ని ప్రాంతాల్లో శోభాయాత్రకు అనుమతివ్వకపోవడంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. భైంసాలో శ్రీరామనవమి…
నేడు భైంసా లో గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్త్ చేసారు. ఈ నిమజ్జనానికి మొత్తం 500 మంది పోలీసులతో బందోబస్తుతో పాటుగా 150 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. అదనపు ఎస్పీ తో పాటు ఇద్దరు ఏ ఎస్పీలు 3 డిఎస్పీలు 11 మంది సీఐ లు 36 ఎస్సై లు 251 మంది కానిస్టేబుళ్లు 37 హోంగార్డు లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు అధికారులు. వీటితో పాటు 10 పికెటింగ్…