బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో.. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర రెండోరోజు పాదయాత్రలో భాగంగా బస్వాపూర్, ఇంద్రమ్మ కాలనీ, భువనగరి పట్టణంలోని హుస్నాబాద్, అంబేద్కర్ విగ్రహం, బస్టాండ్, ప్రిన్స్ కార్నర్ కేఫ్, రామ్ మందిర్, హైదరాబాద్ చౌరస్తా మీదుగా టీచర్స్ కాలనీ వరకు పాదయాత్ర కొనసాగనుంది. బస్వాపూర్ గ్రామంలో బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులతో కలిసి రచ్చ బండ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతారు. బీజేపీ లోకి పార్టీ చాలా మంది నాయకులు రావాలను కుంటున్నారని, పార్టీ లోకి వచ్చిన వారికి సముచ్చిత స్థానం కలిపిస్తామని పేర్కొన్నారు. బీజేపీ సిద్ధాంతాలు నమ్మి బిజెపి పార్టీ లోకి ఎవరు వచ్చిన స్వాగతిస్తామని బండి సంజయ్ అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ కొట్లాడే పార్టీ బీజేపీ పార్టీ అని, కుటుంబ, అవినీతి పాలన, అరాచక పాలనపై కొట్లాడే పార్టీ బీజేపీదే అని పేర్కొ్న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షల , ఏ ఆశయాల ఏర్పడదో వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఆకాంక్షల కోసం బీజేపీ పార్టీ పని చేస్తోందని బండి సంజయ్ తెలిపారు.
read also: Umamaheswari Funerals: మహా ప్రస్థానంలో ఉమా మహేశ్వరి భౌతిక కాయానికి అంత్యక్రియలు పూర్తి..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో.. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిన్న ప్రారంభమైంది. ఈయాత్ర ఐదు జిల్లాల్లోని 12 నియోజకవర్గాలను చుడుతూ, 328 కిలోమీటర్ల మేర.. 24 రోజుల పాటు బండి పాదయాత్ర చేయనున్నారు. పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించి, వంగపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రిలో ప్రారంభమై వరంగల్‌లోని భద్రకాళి ఆలయం వరకు కొనసాగనుంది. ఈసారి చారిత్రక, తెలంగాణ సాయుధ, ఉద్యమ పోరాటాల నేపథ్య ప్రాంతాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది. జనం గోస వినడం.. ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు తెలంగాణలో రాబోయేది భాజపా సర్కారేననే సంకేతాలు పంపడమే ఈయాత్ర లక్ష్యంగా బండి ముందుకు వెళ్లనున్నారు. అయితే.. మరోవైపు ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో శ్రేణులు నిమగ్నమయ్యాయి. ఈ నెల 26న భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా.. ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Covid Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?