కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారి మల్లిస్తోంది అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. నిధులు ఖర్చు చేయకపోవటంతో రిటర్న్ వెళ్లాయి. రాజకీయ పబ్బం కోసమే ఇద్దరు ముఖ్యంత్రుల జల జగడం అని తెలిపారు. నీటి సమస్య పరిష్కారంపై సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదు. కేంద్ర పథకాల అమలుకు టీఆర్ఎస్ సర్కార్ సహకరించటం లేదు. తెలంగాణ పల్లెలకు వచ్చే ప్రతి రూపాయి కేంద్రం నిధులే. హైదరాబాద్ ప్రజలు కట్టే పన్నులు పాలకులు దోచుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి నెల 30కోట్లు వడ్డీలు కడ్తోంది. మోదీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు.
ఇక వైద్యవిద్యలో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయటమే ఇందుకు నిదర్శనం. ప్రధాని మోదీ నిర్ణయంతో వెనుకబడిన వర్గాలలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కుటుంబ ప్రయోజనాల కోసమే ప్రాంతీయ పార్టీలు పనిచేస్తున్నాయి.కులాలు, మతాల పేరుతో ఓట్లు దండుకోవటమే ప్రాంతీయ పార్టీల లక్ష్యం అని పేర్కొన్నారు.