BJP and JAC: కేటీఆర్ ములుగు పర్యటన.. బీజేపీ, జేఏసీ నాయకులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP-JAC: నేడు మంత్రి కేటీఆర్ ములుగు పర్యటన సందర్భంగా బీజేపీ నాయకులతో పాటు JAC నాయకులు ముందస్తు అరెస్ట్ కొనసాగుతుంది. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పలువురు JAC, బీజేపీ, BJYM నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ములుగుకు ఏమి చేశారు, ఎందుకు మంత్రి కేటీఆర్ ములుగు పర్యటనకు వస్తున్నారని బీజేపీ, బీజేవైఎం నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. దీంతో అక్కడ అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా ముందుస్తుగా నిన్న అర్ధరాత్రి నుంచే బీజేపీ, జేఏసీ, బీజేవైఎం నాయకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Read also: Students Passport: పంజాబ్ విద్యార్థుల పాస్‌పోర్టు సమస్య.. కేంద్రానికి రాష్ట్ర మంత్రి వినతి
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించనున్నారు. 150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కేటీఆర్ చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కనే 65 కోట్లతో నిర్మించతలపెట్టిన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం, 38.50 కోట్లతో జిల్లా పోలీసు కార్యాలయ భవనం, 11.40 కోట్లతో మేడారంలో శాశ్వతంగా నిర్మించనున్న భవనాలు, 1.20 కోట్లతో ఆదర్శ బస్టాండుకు, .50 లక్షలతో నిర్మించనున్న సేవాలాల్ భవనానికి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ములుగు 2.50 కోట్లతో నిర్మించిన ములుగు పోలీసు స్టేషన్ భవనంతో పాటు జిల్లాలో మొత్తం 12 కోట్లతో వివిధ ప్రాంతాలలో నిర్మించిన ఆదర్శ పోలీసుస్టేషన్ల భవనాలను ములుగు నుంచే ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి రామప్ప చేరుకొని ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ఇరిగేషన్ డేను పురస్కరించుకొని రామప్ప రిజర్వాయర్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించి గోదావరికి హారతి ఇవ్వనున్నారు. అక్కడి నుంచి నేరుగా ములుగు పంచాయతీ వద్దకు చేరుకొని కోటితో నిర్మించిన శ్మశాన వాటిక, 2 కోట్లతో నిర్మించిన అంతర్గత సిమెంటు రోడ్లు, జిల్లా రవాణా కార్యాలయాన్ని ప్రారంభింస్తారు. ఆ తర్వాత ములుగు సమీపంలోని సాధన పాఠశాల పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
Students Passport: పంజాబ్ విద్యార్థుల పాస్‌పోర్టు సమస్య.. కేంద్రానికి రాష్ట్ర మంత్రి వినతి
తాజావార్తలు
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!