Boyapati Rapo: రామ్, శ్రీలీల.. మామూలుగా లేరుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ బ్యూటీ శ్రీలీల హవా నడుస్తోంది. సెట్స్ పై ఉన్నబడా సినిమాల్లో.. శ్రీలీల లేని సినిమా లేదనే చెప్పాలి. అమ్మడి అందం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో కుర్రకారుకు బాగా కనెక్ట్ అయిపోయింది శ్రీలీల. అలాంటి ఈ బ్యూటీకి తోడుగా ఎనర్జిటిక్ హీరో రామ్ తోడైతే.. విజిల్స్‌తో థియేటర్ టాపులు లేచిపోవాల్సిందే. రామ్, బోయపాటి అప్ కమింగ్ మూవీతో ఇదే జరగబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో.. ఊరమాస్‌గా ఈ సినిమా రాబోతోందని చెప్పేశారు. వచ్చే దసరాకు రామ్, బోయపాటి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ చేయలేదు. ప్రస్తుతానికి #BoyapatiRAPO అంటూ వర్కింగ్ టైటిల్‌తోనే షూటింగ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్‌లో జరుగుతోంది. జూన్ 15 వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. అక్కడే ఓ సాంగ్ కూడా షూట్ చేయనున్నారు. ఈ క్రమంలో రామ్, శ్రీలీల ఫోటోలు బయటికొచ్చాయి. మామూలుగానే ఈ ఇద్దరి స్పీడ్‌ను తట్టుకోవడం కష్టం. అలాంటి ఈ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి.. జస్ట్ శాంపిల్‌గా ఈ ఫోటోలు ఉన్నాయి. డబుల్ ఎనర్జీ లోడింగ్ అన్నట్టుగా ఉంది. రామ్ స్టైలిష్‌గా కనిపిస్తుండగా.. శ్రీలీల చాలా క్యూట్‌గా అందంగా కనిపిస్తోంది. ఆన్ స్క్రీన్ పై ఈ జోడి అదరగొట్టడం ఖాయమనేలా ఉన్నారు. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి రామ్, శ్రీలీల ఫోటో ఒక్కటి బయటికి రాలేదు. దాంతో లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి రామ్, శ్రీలీల ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!