డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు ఊరట కల్పించిది నాంపల్లిలోని స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడిన వాహనాదారులకు రూ. 2,100 ఫైన్ కట్టించుకుని వదిలేస్తోంది కోర్టు. 2018 ఏడాది నుండి 28,938 పెండింగ్ చలాన్లు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.. ఇక, ఫిబ్రవరి 19వ తేదీ నుండి మార్చి 12వ తేదీ వరకు ఫైన్ కట్టుకునే అవకాశం కలిపించింది నాంపల్లి కోర్టు.. దీంతో, నాంపల్లి లోక్‌అదాలత్ వద్ద క్యూ కడుతున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన వాహనాదారులు.. మూడు రోజుల్లో సుమారు 3 వేల మంది కోర్టులో హాజరు అయినట్టుగా చెబుతున్నారు.. లేబర్ వర్క్స్, ఆటో డ్రైవర్స్ పనులు చేసుకునే వారికి ఇది మరింత ఊరటగా చెబుతున్నారు.
Read Also: Hijab Row: ప్రకాశం జిల్లాలో వివాదం.. పరిస్థితి ఉద్రిక్తం..!
కాగా, గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడితే రూ.10,500 జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించింది కోర్టు.. దీంతో డబ్బులు కట్టలేక వాహనాలను వదిలేసి వెళ్తున్న వాహనదారులు సంఖ్య పెరుగుతూ పోతోంది.. ఇప్పుడు ఫైన్‌ను కోర్టు భారీగా తగ్గించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్న వాహనదారులు.. ఫైన్ కట్టి.. తమ వాహనాలను తీసుకెళ్తున్నారు. కాగా, తాగి రోడ్లపైకి వస్తే జరుగుతోన్న రోడ్డుప్రమాదాల నివారణకు పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే.. గతంలో వీకెండ్‌కు, సాయంత్రం, నైట్‌కు పరిమితమైన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. వారం, సమయంతో పనిలేకుండా.. ఇప్పుడు మరింత విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు పోలీసులు.