కర్నూలు జిల్లా ఆలూరు పీఎస్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ మందుబాబు పోలీసు జీపును దర్జాగా ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలూరులో బుధవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పెద్దహోతూరు యువరాజు పట్టుబడ్డాడు. తన బైక్ ఇవ్వాలని, ఇంటికి వెళ్లి వస్తానని పోలీసులతో చెప్పాడు. బైక్ ఇవ్వకపోవడంతో వేరే బైక్ తీసుకుని వెళ్లాడు. ఇవాళ ఉదయం మళ్లీ బైక్ తీసుకువచ్చాడు. తన బైక్ ఇస్తే వెళ్లిపోతానని, లేకుంటే పోలీస్…
Nalgonda Man Attempts Suicide at Police Station: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని ఓ మందుబాబు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి జరిగింది. సమయానికి హోమ్ గార్డ్, కానిస్టేబుల్ మంటలను ఆర్పి.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మందుబాబు నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. సోమవారం అర్ధరాత్రి రావిళ్ల నరసింహా అనే…
New Year Celebrations: తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు అత్యంత భారీగా జరిగాయి. ప్రజలంతా కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో డీజేలు, డ్యాన్స్‌లు, విందులతో సందడి చేశారు. అయితే, ఈ వేడుకల మధ్య కొన్ని అవాంఛిత ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. చెప్పినట్లుగానే.. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్లపై మందుబాబులు పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా మొత్తం…
మహిళల భద్రత విషయంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం. బస్ మార్షల్స్ నియమించాలని ఎల్జీకి సిఫార్స్ రాజధాని డిటిసి (ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్) బస్సుల భద్రత కోసం మోహరించిన బస్ మార్షల్స్‌ను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనాకు సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాన్ని నొక్కి చెబుతూ.. బస్ మార్షల్స్ నియామకం ప్రయాణీకులకు, ముఖ్యంగా మహిళా ప్రయాణీకులకు భద్రతా వాతావరణాన్ని అందించడంలో సహాయపడిందని మంత్రిమండలి పేర్కొంది. బస్సుల లోపల మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని…
బెజవాడలో మందుబాబులు హల్‌చల్ చేశారు.. మద్యం తాగి కారు నడిపి విధ్వంసం సృష్టించారు.. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బబ్బులు గ్రౌండ్ దగ్గరకు కిట్టు, అరుణ్ మద్యం సేవించి కారు నడుపుతూ వచ్చాడు.. మద్యం మత్తులో కారు ఎలా నడుపుతున్నాడో కూడా తెలియని పరిస్థితిలో.. దంపతులను ఢీకొట్టాడు.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశారు.. ఇక, అడ్డుకున్న పోలీసులతో.. వాగ్వాదానికి దిగారు.
విశాఖపట్నంలో ఓ మందుబాబు హల్‌చల్ చేశాడు. ట్రాఫిక్ పోలీసులపై మందుబాబు వీరంగం సృష్టించాడు. విశాఖలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా ఇద్దరు స్నేహితులు తాగి బండిపై వచ్చారు. వారిలో ఓ వ్యక్తి అక్కడి నుంచి పరారీ కాగా.. మరో వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.
నూతన సంవత్సర వేడుకలు ముగ్గురు యువకుల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఏలూరు జిల్లాలో న్యూఇయర్ రోజున విషాదం చోటుచేసుకుంది. అగిరిపల్లి మండలం కనసానపల్లిలో మద్యం మత్తులో బుల్లెట్ బండి నడుపుతూ బావిలోకి దూసుకెళ్లాడు ఓ యువకుడు. బుల్లెట్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
Man was caught drunk and driving and set his bike on fire: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడితే.. కొందరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు లేదా వాగ్వాదానికి దిగుతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన ద్విచక్ర వాహనానికి ట్రాఫిక్ పోలీసుల ఎదుటే నిప్పు అంటించాడు. మంటలను ఆర్పిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్…