టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళితుల మీద దాడులు, లాకప్ డెత్ లు పెరిగాయి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పోలీస్ ల దెబ్బలకు తట్టుకోలేక మరియమ్మ మరణించింది. దీని పై మేము గవర్నర్ ను కలిసి వస్తుంటే సీఎం కార్యాలయం నుంచి మాకు ఫోన్ వచ్చింది. దళిత ఎంపవర్ మెంట్ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. దళితుల మీద దాడులు చేస్తూ సమావేశానికి రమ్మంటే ఎందుకు రావాలని నిలదీశాను.. దాంతో సీఎం మమ్మల్ని కలవడానికి అవకాశం ఇచ్చారు. దళితుల మీద దాడులు జరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సీఎంను కోరాము అని తెలిపారు. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీ టీం అంటున్న బీజేపీ నేతకు సిగ్గుండాలి. ఒక దళిత ఎమ్మెల్యేగా నేను నీలా మౌనంగా ఉండలేనురా దుర్మార్గుడా. సిద్దిపేటకు వెళ్లి హరీష్ రావు కు, అసెంబ్లీ లో సీఎం కు ఎందుకు పిటిషన్ లు ఇచ్చావు అన్నారు. ఇక దళితుల కోసం మేము ఎందాకైనా పోరాడుతాం, ఎవరినైనా కలుస్తాం అని పేర్కొన్నారు.