Bhatti Vikramarka Fires On KCR Sarkar For Not Completing SLBC Project: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన SLBC టన్నెల్ ప్రాజెక్టు పనులను తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టలేదని.. కుట్రపూరితంగానే ఆ ప్రాజెక్ట్ పనుల్ని నిర్లక్ష్యం చేసి పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రజలకు తీరని ద్రోహం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. తన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా.. బుధవారం అచ్చంపేట మండలం ఎస్‌ఎల్‌బీసీ టన్నల్‌ను భట్టి విక్రమార్క పరిశీలించారు. సొరంగ మార్గంలోకి క్రేన్‌లో వెళ్లి జరిగిన పనుల్ని పరిశీలించిన అనంతరం.. పనుల పురోగతి వివరాలు సైట్ ఇన్చార్జి ఆర్పీ సింగ్‌ని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గ్రావిటీ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు ఇచ్చే విధంగా డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టును.. ప్రత్యేక తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం రెట్టింపు స్పీడుతో పూర్తి చేయాల్సిందని, కానీ ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కారణంగా పది సంవత్సరాలుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
Adipurush: ఏమయ్యా ఓం రౌత్.. తిరుమల కొండపై హీరోయిన్ తో ఏంటా పాడు పనులు
పది సంవత్సరాల్లో మిగిలున్న పది కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని పూర్తి చేయకుండా.. ప్రభుత్వం దున్నపోతు నిద్రపోతున్నట్టుగా పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా, కావాలని ఈ ప్రాజెక్టును పెండింగ్‌లో పెట్టిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. టన్నెల్ బోర్ నాలుగు సంవత్సరాలుగా పనిచేయడం లేదని తెలిసినా.. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రూ.2259 కోట్లతో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు.. బిఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేయడం వల్ల అంచనా వ్యయం రూ.4776 వేల కోట్లకు పెరిగిందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఈ ప్రాజెక్టుకు రూ.1000 కోట్ల మంజూరు చేసి ఉంటే, ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. బిఆర్ఎస్ పాలకులకు ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లా ప్రజల పట్ల ప్రేమ, ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే.. రూ.1000 కోట్లు కేటాయించడం పెద్ద విషయమేమీ కాదన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే.. నాలుగు లక్షల ఎకరాల భూముల్లో పంటలు పండి, ఎకరానికి రైతులకు రూ.20 వేలు చొప్పున ఆదాయం వచ్చి ఉండేదని అంచనా వేశారు. ప్రాజెక్టు పూర్తయిన 5 సంవత్సరాలలోపే.. రైతులకు పంటల ద్వారా రూ.5600 కోట్లు ఆదాయం వచ్చి, ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు కూడా తీరిపోయి ఉండేదన్నారు.
Google Pay: ఇకపై డెబిట్ కార్డ్ అవసరం లేదు.. ఆధార్ తో గుగూల్ పే యాక్టివేషన్..
ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లా రైతుల చేతుల్లో దాదాపుగా రూ.10 వేల కోట్లు టర్నోవర్ అవడం వల్ల.. వాళ్ల జీవన ప్రమాణస్థితులు మారేవని, కొనుగోలు శక్తి పెరిగి ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేదని భట్టి విక్రమార్క వివరించారు. కానీ.. ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు ఇవ్వకపోవడంతో, 9 సంవత్సరాలుగా 4 లక్షల ఎకరాల భూములు బీడుగా మారి, రైతుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. SLBC నుంచి నీళ్లు తీసుకుపోవాలని నల్లగొండ జిల్లా మంత్రికైనా బుద్ధి ఉండాలి కదా? ఆ మంత్రి ఈ ప్రాజెక్టు వద్దకు వచ్చి రివ్యూ చేసి నీళ్లు తీసుకుపోవాలన్న తపన ఉండాలి కదా? దిష్టిబొమ్మగా ఉంటే ఏం లాభం? పదేళ్ల నుంచి ఏం చేస్తున్నావ్? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పదవి బాధ్యతలు తీసుకోగానే ఎస్‌ఎల్‌సి వద్దకు వచ్చి, అధికారులతో సమీక్షలు నిర్వహించి చకాచకా పనులు చేయించారన్నారు. మంత్రిలాగా ఉండాలి కానీ, జిల్లాకు దిష్టిబొమ్మలా ఉండి కేసీఆర్‌కు భజన చేసుకుంటే సరిపోతుందా? మంత్రి పదవి అంటే ఇదేనా? అని నిలదీశారు. SLBC లాంటి ప్రాజెక్టులను నిరుపయోగంగా పెట్టడం వల్ల రాష్ట్రం చాలా నష్టపోయింని ఆవేదన వ్యక్తం చేశారు.
V Hanumantha Rao: పేదవాడికి న్యాయం చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది
తెలంగాణలోని ఏడు ఉమ్మడి జిల్లాలకు త్రాగునీరు, సాగునీరు.. హైదరాబాద్ పరిశ్రమలకు నీరు అందించేందుకు డిజైన్ చేసిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, SLBC లాంటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే.. మిషన్ భగీరథకు రూ.42 వేల కోట్ల ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఉండేదని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. మిషన్ భగీరథలో వచ్చే కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టుల్ని చంపేశారన్నారు. వందల గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంలో ట్యాంకులు కట్టి, పైపులు వేసి వదిలేశారని.. నీళ్లు ఇవ్వడం లేదని తనకు వందల గ్రామాల్లో ప్రజలు చెప్పారని అన్నారు. మిషన్ భగీరథ గురించి తాను చెప్తున్నా మాటల్లో అనుమానం ఉంటే.. తాను చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేవారు. మిషన్ భగీరథ నీళ్లు రాని గ్రామాలను దగ్గరుండి తీసుకువెళ్లి చూపిస్తానని సవాల్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా.. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు బిఆర్ఎస్ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్ల వద్దకు వెళ్లి నిలదీయాలని పిలుపునిచ్చారు. నీళ్లు సాధించుకోవడం మన హక్కు అని, మన హక్కును కాలరాస్తున్న బిఆర్ఎస్ పాలకులను నిలదీయకుంటే ఇంకా నష్టపోతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.