Adipurush: దైవ సన్నిధిలో ఎలా ఉండాలి.. ఎలా నడుచుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకంటే.. దేవుడి దగ్గరకు వచ్చే భక్తులు.. ఆ దేవుని నామస్మరణలోనే లీనమై ఉంటారు. ప్రతి గుడికి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. వాటిని పట్టించకపోవడం హిందూ సంప్రదాయాలను దెబ్బతీసినట్టే అవుతుంది. ఇక ఇలాంటి చిన్న చిన్న విషయాలను చాలామంది స్టార్లు మర్చిపోతుంటారు. గతంలో నయనతార ఒక ఆలయంలోని చెప్పులతో వెళ్లి అందరిచేత చివాట్లు తిన్న విషయం తెల్సిందే. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి పనులు చేస్తే ఏకిపారేస్తారు. అయితే ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ అంతకు మించిన పెద్ద తప్పునే చేశాడు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో పాడుపని చేసి మరింత రచ్చ లేపాడు.
Mahi V Raghava : ఆ డైరెక్టర్ అంత వైలెంట్ గా ఎందుకు థింక్ చేసాడు…?
అసలు విషయం ఏంటంటే.. గతరాత్రి ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా ముగించుకున్న ఆదిపురుష్ చిత్రబృందం నేటి ఉదయం స్వామివారి ఆశీస్సులు అందుకోవడానికి ఆలయానికి వచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలో హీరోయిన్ కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్ ఉన్నారు. పూజ అనంతరం కృతి బయల్దేరుతూ అందరికి బై చెప్తూ.. డైరెక్టర్ ఓం రౌత్ కు బై చెప్పడానికి కౌగిలించుకుంది. ఇక డైరెక్టర్ మాత్రం ఆమె బుగ్గను ముద్దాడడమే కాకుండా గాల్లో కూడా ముద్దులు ఇచ్చి బై చెప్పాడు. ఇక ఈ ఘటన ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఛీఛీ.. ఇవేం పాడుబుద్దులు అయ్యా.. ఓం రౌత్ దేవుడి సన్నిధానంలో ఉండి ఏంటి ఇవి అని ఏకిపారేస్తున్నారు. అయితే హాగ్ చేసుకొని ముద్దు పెట్టి బై చెప్పే విధానం తప్పు కాకపోవచ్చు.. కానీ, మనం ఎలాంటి ప్లేస్ లో ఉన్నాం అనేది చూసుకోవాలి కదా అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వివాదంపై ఓం రౌత్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
తిరుమల శ్రీవారి ని దర్శించుకున్న ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనాన్, డైరెక్టర్ ఓం రౌత్..#AdipurushPreReleaseEvent #Adipurush #JaiShriRam #AdipurushTrailer2 #AdipurushActionTrailer #Prabhas #KritiSanon #OmRaut #Tirupati #NTVENT #NTVTelugu pic.twitter.com/xPrdznj5Bo
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) June 7, 2023