Google Pay: ఆధార్ కార్డు సహాయంతో ఇకపై ‘గూగుల్ పే’ని యాక్టివేట్ చేసుకోవచ్చని మంగళవారం ఆ కంపెనీ తెలిపింది. యూపీఐ యాక్టివేట్ కోసం ఆధార్ ఆధారిత అథెంటికేషన్ ప్రారంభించింది. ఇకపై యూజర్లు డెబిట్ కార్డ్ సహాయం లేకుండా యూపీఐ పిన్ యాక్టివేట్ చేసుకునేలా గూగూల్ పే శ్రీకారం చుట్టింది. వినియోదారుడు వారి ఆధార్ నంబర్ ఉపయోగించి సైన్ అప్ చేయడానికి గూగుల్ పే అనుమతిస్తుంది. ఈ ప్రక్రియకు డెబిట్ కార్డ్ వివరాలను ధృవీకరించాల్సిన అవసరం లేదు. భారతదేశంలోని 22 బ్యాంకుల కస్టమర్లు ఆధార్ ఉపయోగించి గూగుల్ పే అథెంటికేషన్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది.
* ఆధార్ నంబర్ ఉపయోగించి గూగుల్ పేలో యూపీఐ కోసం నమోదు చేసుకోవాలనుకునే వినియోగదారులు UIDAI, బ్యాంక్ అకౌంట్ కు ఒకే రిజిస్టర్ మొబైల్ నంబర్ ఉండేలా చూసుకోవాలి. అయితే ఈ ప్రక్రియ సమయంలో గూగుల్ పే, వినియోగదారుల ఆధార్ నంబర్లను స్టోర్ చేయడం లేదని తెలిపింది.
Read Also: Adipurush: ఏమయ్యా ఓం రౌత్.. తిరుమల కొండపై హీరోయిన్ తో ఏంటా పాడు పనులు
* ముందుగా వినియోగదారుడు తన ఆధార్ నంబర్ లోని మొదటి ఆరు అంకెలను నమోదు చేయాలి. ఈ అంకెలను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( NPCI), UIDAI పంపుతుంది. NPCI యొక్క వెబ్‌సైట్ ప్రస్తుతం 22 బ్యాంకులు ఆధార్ ద్వారా వినియోగదారులు గూగుల్ పేలో యూపీఐ పిన్ సెట్ చేసుకునేందుకు సపోర్టు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో మరన్ని బ్యాంకులు ఈ ఫీచర్ ని సపోర్టు చేస్తాయని కంపెనీ చెప్పింది.
* ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ముందుగా వినియోగదారుడు తన బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్ లింక్ చేయబడిందా లేదా..? అని నిర్థారించుకోవాలి. గూగుల్ పేలో యూపీఐ సక్సెస్ ఫుల్ గా నమోదు చేసుకోవాలంటే.. వారు తమ బ్యాంక్, UIDAIతో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ ని ఉపయోగించి యూపీఐ కోసం సైన్ అప్ చేయాల్సి ఉంటుంది.
* వినియోగదారులు తమ బ్యాంక్, UIDAI నుండి వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను (OTPలు) పొందుతారు. ఇది ప్రాసెస్ పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ తరువాత వినియోగదారుడు యూపీఐ పిన్ సెట్ చేసి, గూగుల్ పేని వాడవచ్చు.