Fake Baba Hafiz Pasha Arrested In Hyderabad Langer House: హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్‌లో దొంగ వీఐపీ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. భూతవైద్యం పేరుతో ఇప్పటివరకూ ఈ బాబా 7 పెళ్లిళ్లు చేసుకున్నాడు. దయ్యం పట్టిందని నమ్మించి, యువతులను లొంగదీసుకోవడం ఈ బాబా స్పెషాలిటీ. ఇప్పుడు ఇతను 8వ పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ పెళ్లికి హాజరయ్యేందుకు సుమారు 200 మంది ఫంక్షన్ హాల్‌కి చేరుకున్నారు. రాత్రి 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. అయితే.. ఆ బాబా రాలేదు. అతని కోసం కొద్దిసేపు వేచి చూసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. అమ్మాయి తరఫు వాళ్లు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు రంగంలోకి దిగారు. ఆ దొంగ బాబాను అదుపులోకి తీసుకున్నారు. ఈ దొంగ బాబాకు పక్కం రాష్ట్రంలో ఉన్న బడా రాజకీయ నాయకుల అండ ఉందని సమాచారం.
Varisu: యుట్యూబ్ ని షేక్ చేస్తున్న జిమిక్కీ పొన్ను…
ఈ కేసు వివరాల్ని లంగర్ హౌజ్ సీఐ శ్రీనివాస్ వెల్లడిస్తూ.. ‘‘నిన్న రాత్రి 11 గంటలకు తబస్సుమ్ ఫాతిమా అనే అమ్మాయి మా పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. నెల్లూరులో ఉన్న రెహ్మతాబాద్ దర్గాకి చెందిన హఫీజ్ పాషా అనే బాబా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. టోలిచౌకికి చెందిన ఫాతిమా మూడేళ్లుగా నెల్లూరు దర్గాలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి, తనని పెళ్లి చేసుకుంటానని బాబా చెప్పాడు. దీంతో హైదరాబాద్ టోలిచౌకి ఫంక్షన్ హాల్‌లో తబస్సుమ్ కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. నిన్న రాత్రి 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. అయితే.. ఆ బాబా పెళ్లికి రాలేదు. ఎంతసేపు వేచి చూసినా రాకపోయేసరికి.. ఫిర్యాదు చేశారు. పెళ్లికూతురు తబస్సుం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం’’ అని తెలిపారు. ఈ బాబాకు గతంలో 7 పెళ్లిళ్లు అయినట్లు అమ్మాయి తరఫు బంధువులు చెప్తున్నారని, అన్ని కోణాల్లో తాము దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.
Minister KTR: ఓల్డ్ సిటీ, రామోజీ ఫిల్మ్ సిటీ వరకు మెట్రో విస్తరణ.. మంత్రి కేటీఆర్ క్లారిటీ..
ఇదే సమయంలో పెళ్లికూతురు తండ్రి జహీర్ మాట్లాడుతూ.. ‘‘నా కూతురుకి అనారోగ్యంగా ఉందని నెల్లూరు రెహ్మతాబాద్ దర్గాకి తీసుకెళ్లాం. అక్కడ ఆ దొంగ బాబా నా కూతుర్ని ట్రాప్ చేశాడు. నా కూతురు ఆరోగ్యం మరింత క్షీణించింది. బ్లాక్ మ్యాజిక్ చేశాడని మాకు అనుమానంగా ఉంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నేను చెప్పిన చోటే, నేను చెప్పిన ఫంక్షన్ హాల్‌లోనే పెళ్లి ఏర్పాట్లు చేయాలని ఆ బాబా అన్నాడు. తాను చెప్పిన చోటే ఏర్పాట్లు చేశాం. అయితే.. పెళ్లి సమయం దాటిపోయినా బాబా రాలేదు. నీ కూతురికి పెద్ద ఆరోగ్య సమస్య ఉందని, పెళ్లి బంధనంతో అది నయమవుతుందని, లేకపోతే చనిపోతుందని బెదిరించడం వల్లే.. అతనితో ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. నా కూతురి వయస్సు 18 ఏళ్లు మాత్రమే అయితే, ఆ బాబా వయసు 54 ఏళ్లు. వాళ్ల మనుషులొచ్చి, బాబాకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Minister KTR: టీఎస్ బీపాస్ దేశంలోనే ఎక్కడా లేదు